By Village Missionary Movement
Friday, 23-Sep-2022దిన ధ్యానము(Telugu) 23.09.2022
అంశం:- అంటరానితనం.
"దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను" - అపో.కార్యములు 10:34
మేము ఇతరులను అంగీకరిస్తాము. ఇతర ప్రజలను కలపడానికి ఇష్టపడతాము. కాని సంకర జాతులుగా ఉండటం మాకు ఇష్టం లేదు అని హంగేరి దేశపు ప్రధాన మంత్రి విక్టర్ చెప్పారు. ఇతను రాసిన థి గార్డియన్ అనే పత్రిక బయలు పరచడంతో హంగేరి అంతా తీవ్ర సంచలనం ఏర్పడింది. ఒక దేశ ప్రధానియే తన దేశంలో నివసిస్తున్న ప్రజలను జాతులుగా విడదీసి మాట్లాడడం ఎంత కపటం తన యొద్ద ఉన్న మంత్రులలో ఒక మంత్రి పదవికి రాజీనామా చేసి నిందను నమోదు చేశాడు. జాతి వివక్షణను మరియు వర్ణ వివక్షణను ఒకరు కలిగి ఉన్నట్టు అయితే అది వారిని నరకానికి నడిపించే ఘోరమైన పాపం అని పరిశుద్ధ గ్రంధం మనలను హెచ్చరిస్తోంది. గొర్రెలు మేపేవారు అంటే ఐగుప్తీయులకు హేయము అలానే యూదుల దృష్టిలో సమరయులు అపవిత్రులు. ఈవిధంగా ప్రతి ఒక్క జాతి వారిని లేదా ఇతర ప్రజలను చూసినప్పుడు తమ్మును వారి కంటే ఉన్నత మైన వారి వాలె హెచ్చించుకొనే అనేకుల గురించి మనం పరిశుద్ధ గ్రంధములో మనం చదువుతున్నాం. ఇటువంటి స్వభావమును దేవుడు ఎన్నడును ఇష్టపడరు. మతం, మార్గం, జాతి అని పక్షపాతంగా నడుచుకొనుటను దేవుడు అస్సులు అంగీకరించడు.
గలతి పత్రికలో పేతురు సున్నతి పొందిన వారికి భయపడి అన్యజనులతో నటించుట వలన పౌలు గద్దించడం మనం చదువుతున్నాం. రక్షించబడిన అనేకుల యొద్ద కుల పక్షపాతం ఉండటం నేటికి కాదనలేము. తాను చూచిన సహోదరుని ప్రేమింప లేనివాడు తాను చూడని దేవున్ని ప్రేమించలేడు అని యోహాను వ్రాశాడు. ఇతర వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, ప్రేమించడం మీ హృదయంలో లేనట్లయితే దేవుని దృష్టిలో మీరు హేయులే. ఎవరి పైన పక్షపాతం చూపించకుండా అందరిని ఒకే విధంగా ప్రేమించిన దేవున్ని రక్షకునిగా అంగీకరించడం మన యొద్ద పక్షపాతం ఉన్నట్లు అయితే అది ఎంతటి కపటత్వం. మన ప్రభువు యొక్క ఆలోచనలే మనలో ఉండును గాక.
- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు.
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీల ద్వారా ఒక లక్ష గ్రామాలను సందిచుటకు తీసుకొంటున్న ప్రయాసలో దేవుని హస్తం తోడై ఉండు లాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250