Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.09.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 25-Sep-2022

దిన ధ్యానము(Telugu) 25.09.2022 (Kids Special)

 

అంశం:- జాగ్రత్తగా మాట్లాడు.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లలకు

 

"సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతో షము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము" - సామెతలు 15:23

 

హాలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే కథ విందామా?

 

ఒక అందమైన నది తీరం చూడటానికి ప్రకృతి అందాలతో పొంగిపొర్లుతున్న మంచి దృశ్యం. అక్కడ చాలా రకాలైన చెట్లు వికసించి సంతోషంగా ఉన్నాయి. పిల్లలు మీరు కూడా నదిలో స్నానం చేస్తూ జాలిగా ఎంజాయ్ చేస్తారు కదా. అందులోనుండి లేచి బయటకు రావాలి అని మనస్సే ఉండదు కదా. ఆ నది తీరం ప్రక్కన ఒక వేప చెట్టు ఒక చింత చెట్టు మాట్లాడు కొంటున్నాయి. నాకు చాలా వయస్సు అయిపోయింది నా యొక్క వేర్లు అన్ని బలహీనంగా అయిపోయాయి. నా శరీరం అంతా చాలా బలహీనముగా అయిపోయింది. అందువలన గాలి, వర్షం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఈ నదిలో కొట్టుకొని పోతానో తెలియదు అని చింత చెట్టు చెప్పింది. వెంటనే వేప చెట్టు నీ వంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం అని చెప్పి బాధ పడింది. అప్పుడు అక్కడకు ఒక పిచ్చుక వచ్చి ఇల్లు కట్టుకొనుటకు చింత చెట్టు యొద్ద అనుమతి అడిగింది. చింత చెట్టు నిరాకరించడంతో వేప చెట్టుపై గూడు కట్టుకొని సంతోషంగా బ్రతుకుతున్నప్పటికి ఈ చింత చెట్టు తనకు గూడు కట్టుకొనుటకు స్థలం ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంది. హఠాత్తుగా వీచిన గాలి వర్షం వలన ఆ చింత చెట్టు వంగి నదిలో కొట్టుకొని పోతూవుంది. దానిని చూసిన పిచ్చుక నీకు ఇలానే కావాలి నాకు సహాయం చెయ్యలేదు కదా అందుకే నీకు ఈ శిక్ష అని పిచ్చుక చెప్పడంతో ఇంకా మాట్లాడటం ఆపు నిజం తెలుసుకోకుండా మాట్లాడవద్దు. ఆ చెట్టుకు వయస్సు అయిపోయింది తొందర్లో ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఎరిగి నీకు స్థలం ఇస్తే నీవుకుడా నీటిలో కొట్టుకొని పోతావు అనే మంచి ఆలోచన వలన నీకు గూడు కట్టుకొనుటకు అనుమతి ఇవ్వలేదు అని చెప్తూ వేపచెట్టు వెక్కివెక్కి ఏడవడం చూసిన పిచ్చుక కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. వెంటనే పిచ్చుక ఎగురుకొంటు నీటిలో కొట్టుకొని పోతున్న చింత చెట్టు యొద్దకు వెళ్ళి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని అడిగింది. నది ఒడ్డున ఉన్న ఆ చింత చెట్టును ఒక కలప వ్యాపారి తీసుకొని వెళ్లి ఒక మంచి వస్తువును తయారు చేసాడు. చనిపోయిన తరువాత కూడా ఉపయోగ కరముగా ఉన్న ఆ చింత చెట్టును చూసి పిచ్చుక చాలా ఆశ్చర్యపడింది. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి మనం మాట్లాడేటప్పడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు మేలు చేయలేదు అని ఇతరుల కొరకు తప్పుగా లేదా హేళనగా మాట్లాడకూడదు. ఇతరులను సంతోషపరిచే విధంగా మాట్లాడి జాగ్రత్తగా ఉండాలి. సరేనా! సరే పిల్లలు మనం మాట్లాడేటప్పుడు ఇతరులు సంతోషపడే విధంగా మాట్లాడాలి అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకొందమా? 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet