Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.09.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 25-Sep-2022

దిన ధ్యానము(Telugu) 26.09.2022 (Youth Special)

 

అంశం:- నిశ్శబ్ద సువార్త.

 

"కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును" - ఫిలిప్పీయులకు 4:19

 

ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ పూర్వక శుభాకాంక్షలు. ప్రపంచ చెవిటి దినోత్సవం నాడు మీకు నా సాక్ష్యం పంచుకొనుటలో నేను చాలా సంతోషిస్తున్నాను. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను పుట్టినప్పటి నుండి చెవులు వినిపించని వాడినై మాట్లాడలేని వాడినై వుంటిని. నా కుటుంబం చాలా పేద కుటుంబం. నా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను పెంచారు. ఇతర పిల్లలు వలె నేను చదవలేను కాబట్టి చెవులు వినిపించని వారి కొరకు నిర్మించిన ప్రత్యేకమైన పాఠశాలలో నన్ను చేర్చారు. యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే అనుకుంటూ ఉండేవాడిని. మిక్కిలి కష్టముల మధ్యలో చదువును పూర్తి చేసి ఉద్యోగములో చేరాను. నాకు చెవులు వినిపించక పోవడం వలన నేను ఉద్యోగం చేసే స్థలములో నన్ను చాలా దారుణంగా తిట్టేవారు. నేను మాత్రమే ఎందుకు ఇలా పుట్టాను అని ఏడ్చే వాడిని. నాకు వివాహం అయ్యింది. నా బార్యకుడా పుట్టినప్పటి నుండి చెవుడు, మూగ కలిగినది. కాని మాకు పుట్టిన పిల్లలు మాత్రం చాలా ఆరోగ్యంగా పుట్టారు. 

 

నేను శరీర బలహీనతతో బాధపడుతున్నప్పుడు నా ఆత్మ కూడా పాపములో చిక్కుకుంది. అప్పుడు నా వలె వినలేని మాట్లాడలేని ఒకతనిని కలిశాను. మనలాంటి వారికొరకు ఒక కూటమి ఉంది అందులో పాలు పంచు కొంటావా అని అతను నన్ను అడిగారు. సరే అని నేను వెళ్లి పాల్గొన్నాను. నేను ఎంత ఘోరమైన పాపి వలె ఉన్నానో యేసు నా పాపములు క్షమించుటకు శక్తిమంతుడైయున్నాడు అని కూటములు నేను తెలుసుకున్నాను. రొట్టె విరిచిన సమయంలో ఆయన నా పాపముకొరకు కొట్టబడ్డాడు అని మరియు ద్రాక్షారసము పంచిపెట్టినప్పుడు నా కొరకు రక్తం చిందించాడు అని చాలా ఏడ్చాను. నా జీవితమును పరిపూర్ణముగా యేసుక్రీస్తు కొరకు సమర్పించు కొన్నాను. ఎంతటి సంతోషం నేను రక్షించబడ్డాను. చెప్పలేనంత సంతోషం నాకు కలిగింది. తరువాత దేవుడు తన సేవకోరకు నన్ను పిలిచాడు. సంతోషంగా లోబడి నేను నా కుటుంబం 16 సంవత్సరాలుగా సేవ చేస్తూ వస్తున్నాం. సుమారు 350 మందికి పైగా నా వలె వినలేని మాట్లాడలేని వారిని ప్రభువు చెంతకు నడిపించి వారికి బాప్తిస్మము ఇచ్చుటకు ప్రభువు సహాయం చేశారు. నా కుమారుడు కూడా దేవుని సేవ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చనిపోయేవరకు లేక ప్రభువు యొక్క రాకడ వరకు ప్రభువు కొరకు సాక్షిగా జీవించుటకు ప్రభువు సహాయం చేస్తారు. 

 

ప్రియమైన వారలారా! వినలేని, మాట్లాడలేని నన్ను దేవుడు వాడుకున్నారు. మీ జీవితము ఆయన చేతికి అప్పగించుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏదైనా ఒక కార్యం చెయ్యండి. ప్రభువు మిమ్మును దీవించును గాక!

- బ్రదర్. డి. ధనరాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

తమిళనాడు లో చర్చీలు లేని గ్రామాల్లో 1000 చర్చీలు కట్టబడేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet