Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.10.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 02-Oct-2022

దిన ధ్యానము(Telugu) 03.10.2022 (Youth Special)

 

అంశం:- గాంధీ మరియు క్రైస్తవ్యం

 

"అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ" - లూకా 17:1

 

అక్టోబర్2 అంటేనే మనకు భారత పీత అయిన మహాత్మా గాంధీజీ గుర్తుకు వస్తారు. భారత దేశ స్వతంత్రం కోసం అనేకులు పోరాడినప్పుడు ఈయనను మాత్రమే మనం ప్రత్యేకంగా మహాత్మా అని పిలుచుటకు కారణం అతని యొక్క అహింసా మార్గమే. ఈ అహింసా మార్గం ఏర్పరుచు కొనుటకు ఆధారం పరిశుద్ధ గ్రంధమే అని మనం ఎరిగి యున్నాము. గాంధీజీ. బైబిల్ ను ఒక పవిత్ర గ్రంధంగా అంగీకరించి దానిని చాలా శ్రద్ధతో చదివారు. ఆయన కొండపైన ప్రసంగం చదివినప్పుడు నిన్ను కుడి చెంప పైన కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని మత్తాయి సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడిన వాక్యం చదివారు. ఈ వాక్యం అహింసా లేదా సత్యగ్రామ్ అనే మార్గంలో విరోధులతో. పోరాడాలి అనే ఆలోచన ఆయనలో కలిగించింది. పరిశుద్ధ గ్రంధం చదివి దానిని తన జీవితంలో అన్ని పరిస్థితుల్లో అభ్యసించాలి అని ఆశించి క్రియను జరిగించి చూపించారు. యేసు మనుష్యులకు దొరికిన ఒక ప్రత్యేకమైన బోధకుడు అని కొత్త నిబంధన నాకు సంతోషాన్ని మరియు ఓదార్పును కలిగించింది ఆయన చెప్పారు. ఇంతగా యేసుని ఎరిగి పరిశుద్ధ గ్రంథమును జీవితముగా మార్చు కొని కూడా ఆయన రక్షింపబడలేదు ఇందుకు గల కారణం క్రైస్తవులు క్రీస్తును తమ దేవునిగా ప్రకటించడం నేను చూసాను నేను దానిని అంగీకరించ లేకపోయాను కాబట్టి క్రైస్తవులను నేను ద్వేషించాను నేను క్రైస్తవునిగా మారలేదు అని చెప్పారు.  

 

ప్రియమైన వారలారా! పరిశుద్ధ గ్రంధము దేవుడు మనకు ఇచ్చిన గొప్ప నిధి. దీనిని చదివి ధ్యానించి నట్లయితే మనం అనేక సలహాలు పొందుకొని మంచిగా జీవించ వచ్చు. ఇందులో వ్రాసిన మాటలను వెంబడించాలి తప్ప వాటిని వెంబడించే వారిని చూసి వారు సరిగ్గాలేరు నాకు ఇది అవసరం లేదు అన్నట్లు అయితే మనకే నష్టం. అదే సమయంలో ఇంకొక వైపు కూడా ఆలోచించి చూడాలి. దేవున్ని వెంబడించే మనయొక్క నడవడిక మాటలు మన చుట్టూ వున్న వారు క్రీస్తు యొద్దకు వచ్చుటకు లేదా వచ్చువారు వెనుదిరుగుటకు కారణమై ఉన్నామా అని ఆలోచిద్దాం. అలా ఉన్నట్లు అయితే మనమే అభ్యంతరం కలుగ జేసిన వారిగా అవుతాము. ఇటువంటి వారికి శ్రమ అని యేసుక్రీస్తు చెప్తున్నారు. వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయుట వానికి మేలు అని చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 5:37-40 వచనాల్లో మనకు ఇంకొక విషయం కలదు. అదేమిటంటే పరిశుద్ధ గ్రంధంలో కొన్ని చోట్ల మాత్రమే చదివి దానిని అభ్యసించిన మహాత్మా విజయం సాధించినట్లయితే అనేక మార్లు పరిశుద్ధ గ్రంధము చదువుతున్న మనం వాక్యము నందు విశ్వాసం ఉంచి విజయం పొందుకున్నామా లేదా ఆలోచిద్దాం. వాక్యము యొక్క ప్రత్యేకత ఈరోజు మనం గ్రహిద్దాం, బైబిల్ మన జీవితముగా మారనిద్దాం. హల్లేలూయా!

- సిస్టర్. ఏంజలిన్ గారు

 

ప్రార్థన అంశం:-

ఫిలిప్ గాస్పల్ టీం ద్వారా ప్రతి శనివారం దర్శించ బడుతున్న గ్రామాల కొరకు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz jojobet jojobet giriş jojobet güncel giriş meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel bahsegel bahsegel perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş belugabahis matbet romabet