Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.10.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 05-Oct-2022

దిన ధ్యానము(Telugu) 05.10.2022

 

అంశం:- ఆశీర్వాదం కొరకైన మార్గం.

 

"మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను" - ఫిలిప్పీయులకు 2:8

 

ఒక అందమైన అడవిలో చాలా వెదురు చెట్లు ఉండేవి. వీటన్నింటినీ యజమానుడు చక్కగా నీరు పోసి చేసుకొంటూ వస్తున్నాడు. అతనికి ఇష్టమైన ఒక వెదురు చెట్టుతో కొన్ని నిమిషాలు మాట్లాడతాడు. ఒక రోజు ఆ యజమానుడు వెదురు చెట్టుతో నిన్ను నేను ఉపయోగించుకోబోతున్నాను ఆ సమయం వచ్చింది అని అన్నాడు. ఆ చెట్టు చాలా సంతోషంగా నన్ను ఏ విధంగా ఉపయోగించు కోబోతున్నారు అని అడిగింది. అందుకు యజమానుడు నీవు ఉన్న స్థలం నుండి నిన్ను నరుకుతాను. ఆ తరువాత దాని కొమ్మలన్నింటిని నరికి వేస్తాను ఆ తరువాత నిన్ను రెండుగా చీల్చి నిన్ను ఉపయోగించు కొంటాను అని అన్నాడు. అందుకు ఆ వెదురు చెట్టు చాలా బాధతో ఇన్ని గాయాలు చేసి ఉపయోగించు కొంటారా? అలా అయితే నన్ను ఉపయోగించు కొనవద్దు అని చెప్పింది. తరువాత కొన్ని నిమిషాలు ఆలోచించి నన్ను ఉపయోగించు కొనండి అని చెప్పి తనను తాను అప్పగించు కొన్నది. అప్పుడు యజమానుడు ఆ వెదురును నరికి దానిని రెండుగా చీల్చి ఒక వైపు నీటిలో ఇంకొక వైపు ఎండిపోయిన పొలంలో ఉంచాడు. కొన్ని రోజుల్లో ఆ భూమిని దున్ని విత్తనములు చల్లాడు. అది మొలకెత్తి చెను పెరిగిన తరువాత ఆ చెనును కోసాడు. ఆ వెదురు యొక్క విధేయత వలన ఆ యజమానునికి చాలా సంతోషం కలిగింది. పరిశుద్ధ గ్రంధంలో నీవు పోయి కనికరింపక అమాలేకీయులను మరియు వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేయుము అని యెహోవా సమూయేలు ద్వారా సౌలు కు చెప్పాడు. కాని సౌలు అతని మాటకు లోబడకుండా అమలేకీయుల రాజును ప్రాణముతో పట్టుకొని క్రొవ్విన యెడ్లను మరియు గొర్రెలను నాశనం చెయ్యలేదు. చివరిగా సౌలు యొక్క రాజ్యభారం అతనిని విడిచి పోవుటకు అతని యొక్క అవిధేయత కారణం అయ్యింది. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా శరీరం దేవునికి అవిధేయత చూపుతుందా? 

 

ప్రియమైన వారలారా! ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సిలువ మరణమునకు తన్ను తాను అప్పగించు కొనెను. అందువలన ఆయనను దేవుడు అన్నింటి కంటే ఉన్నతముగా హెచ్చించెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధేయత మనుష్యులందరికి రక్షణను అందించింది కదా! ఇటువంటి పరిస్థితుల్లో అయిన దేవుని ఆజ్ఞలకు, విధులకు లోబడి ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించుటకు మనలను మనం సమర్పించు కొనటం ఎంతటి గొప్ప సంతోషం. హల్లెలూయా!

- శ్రీమతి. నిరోషా ఆల్విన్.

 

ప్రార్థన అంశం:-

పీస్ సెంటర్ కు వచ్చి ప్రార్ధించే వ్యక్తులు పరిపూర్ణమైన విడుదల పొందుకొను లాగున మరియు దేవునికి సాక్షిగా జీవించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet