Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.10.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 23-Oct-2022

దిన ధ్యానము(Telugu) 23.10.2022 (Kids Special)

 

అంశం:- టైమ్ ఈస్ గుడ్

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి" - ఎఫెసీయులకు 5: 15-16

 

హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? స్కూల్ లైఫ్ చాలా జాలిగా సాగుతోందా? ఒక రోజు లీవ్ దొరికితే అందమైన స్థలాలు చూడాలి అని ఆశగా ఉందా? మీ ఆశ న్యాయమైనదే. కాని సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారు? మేము చిన్న పిల్లలమే కదా మేము జాలిగా ఉండకూడదా? అని మీరు అడగవచ్చు. చిన్న వయస్సు నుండే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకొంటే మీరు అనేకులకు ఆశీర్వాదకరముగ మారతారు. కీర్తి తన హాలిడే ను ఎలా ఎంజాయ్ చేసిందో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? 

 

ఒక రోజు కీర్తి వాళ్ళ నాన్నతో కలిసి కొబ్బరి తోటకు వెళ్ళింది. అది అడవి దగ్గర ఉన్న ఒక నది దగ్గర ఉండేది. చూడటానికి చాలా అందముగా ఉండేది. ఆ కొబ్బరి చెట్లు పైన ఉడుతలు అడుకోనుటయు మరియు పిచ్చుకలు అరుపులు విని వాటి వైపు ఆశక్తిగా చూస్తుంది కీర్తి. అంతలో నాన్న కొబ్బరి కాయ కొట్టి ఇచ్చారు. ఆ నీళ్లు చాలా తీపిగా ఉన్నాయి. పిల్లులు మీరు కూడా కొబ్బరి నీళ్ళు తాగుతారా? వేసవికాలంలో తాగుతారు కదా. వేసవికాలంలో త్రాగితే శరీరానికి చాలా మంచిది. సరే ఈ కీర్తి తరువాత ఏం చేసిందో తెలుసా? తోటలో ఉన్న చెట్లకు పైపు సహాయంతో నీళ్లను వేసింది. తను కుడా సంతోషంగా నీటిలో స్నానం చేసింది. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి తినేసి కాసేపు పడుకొంది. సాయంత్రం హోమ్ వర్క్ చేసేసి ఇంటిని శుభ్రం చేసి వాళ్ళ అమ్మకు సహాయం చేసింది. చిన్న పిల్లలారా మరి మీరు కూడా అమ్మకు సహాయం చేస్తారా? సూపర్. కీర్తి వాళ్ళ అమ్మ టీ పెట్టడానికి పంచదార లేపోవడంతో అమ్మ కీర్తిని షాప్ కి వెళ్ళమని పంపించారు. అమ్మ చెప్పిన ఆ పనిని కూడా కీర్తి సంతోషంగా చేసింది. ఆ రాత్రి కుటుంబ ప్రార్ధనలో యేసయ్యకు థాంక్స్ చెప్పింది. 

 

ప్రియమైన పిల్లలారా! యేసయ్య మనకు ఇస్తున్న ప్రతి ఒక్క రోజు మరల దొరకని విలువ కలిగినదై యున్నది. సమయం బంగారం వంటిది. సెల్ ఫోన్, టీవీ చూస్తూనే హోమ్ వర్క్ చేయకుండానే చదువులో శ్రద్ద చూపకుండా ఉండ కూడదు. కీర్తి వలె జాలీగా ఎంజాయ్ చెయ్యాలి. అదే విధంగా మీ బాధ్యతలను కూడా నెరవేర్చాలి. ఓకేనా పిల్లలు మంచి నిర్ణయం తీసుకొనుటకు నా స్వాగతములు. సరే పిల్లలు టైం ఈజ్ గోల్డ్ అని నేర్చుకున్నాం కదా ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకుందమా! 

- సిస్టర్. ఏ. బ్యూలా గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet instagram unban service tiktok unban instagram unban x unban twitter unban palacebet