By Village Missionary Movement
Tuesday, 25-Oct-2022దిన ధ్యానము(Telugu) 25.10.2022
అంశం:- నిష్కపటమైన ప్రేమ.
"తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు" - యోహాను 15:13
మథర్ థెరిస్సా యొక్క ప్రేమ గురించి మనం కచ్చితంగా వినే ఉంటాం. పేదవారి పట్ల ఆమె చూపిన ప్రేమ ఎంతో గొప్పది. తన సొంత దేశమును విడిచి భారత దేశమునకు వచ్చిన ఆమె మన ప్రజల పైన ప్రేమ కారణముగా 45 సంవత్సరాలు దానధర్మాలు చేసారు. ఆమె మరణించే వరకు 123 దేశాల్లో 610 స్వచ్ఛంద సంస్థలు నిర్వహించారు. ఇందులో ఎయిడ్స్, క్షయ, కుష్టు రోగం వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ధర్మ శాలలు, అనాధ శరణాలయాలు, పాఠశాలలు నిర్వహించారు అంటే ఆమె ప్రేమ ఎంత గొప్పదో చూడండి.
1 సమూయేలు 18 :1-16 వచనాల్లో యోనాతాను మరియు దావీదు యొక్క ప్రేమలు గురించి చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల మొదటి రోజు సౌలు అతని యొక్క కుమారుడు యోనాతాను. దావీదు గొర్రెలు మేపే కాపరి. సౌలుకు పట్టిన దూరాత్మను వదిలించుట కొరుకు సితార వాయించుటకు దావీదును రాజా భవనమునకు తీసుకొని వచ్చారు. యోనాతాను మరియు దావీదు మంచి స్నేహితులయ్యారు. కొన్ని కారణాల వలన సౌలు దావీదును చంపుటకు మనుష్యులను పంపించినప్పుడు యోనాతాను దావీదు కొరకు బ్రతిమాలడి సహాయం చేయుటను మనం చూస్తున్నాం. ఇంకా దావీదు సౌలుకు బయపడి అరణ్యములో దాక్కుని వున్నప్పుడు కూడా యోనాతాను అక్కడికి వెళ్ళి దావీదును ధైర్య పరచి ఓదార్చుటను మనం చూస్తున్నాం. ఒక దేశపు రాజ కుమారుడికే సాధారణమైన ఒక యవ్వనుని పైన ఉన్న నిష్కపటమైన ప్రేమను చూడండి.
ప్రియమైన వారలారా! మనం ఇతరుల పైన చూపించే ప్రేమ ఎటువంటింది? కొంచం ఆలోచిద్దాం. మనకు ఏదైనా లాభం వస్తుంది అని ఎన్నోసార్లు మనం నకిలీ ప్రేమను ఇతరులపైన చూపించి ఉంటాం. మథర్ థెరిస్సా లాభం కొరకు, పొగడ్తల కొరకు, మంచి పేరు కొరకు భారతీయులకు సేవ చెయ్యలేదు. ఆమె తనను తగ్గించుకొని జీవించడం మనం ఏరిగినదే. అన్నింటి కంటే పైగా యేసుక్రీస్తు తన ప్రాణమునే అర్పించి మన పై చూపిన నిజమైన ప్రేమ ఎంత గొప్పది. ఇందువలననే మనం ఇంకా నిలిచి ఉన్నాం. మనం కూడా క్రీస్తు యొక్క నిజమైన ప్రేమను ఇతరులపై చూపించి క్రీస్తు యొక్క రూపాన్ని ప్రతిబింబిద్దాం. హల్లేలూయా!
- శ్రీమతి. దివ్య ఫెర్నడ్ గారు
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీల మూలముగా ఒక లక్ష గ్రామాలు సందించుట కొరకు ఏక దర్శనము కలిగిన సేవకులు మనతో ఐక్య పరచబడి దేవుడు ఇచ్చిన దర్శనం నెరవేర్చ బడులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250