Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.10.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 26-Oct-2022

దిన ధ్యానము(Telugu) 27.10.2022

 

అంశం:- ఓదార్చే దేవుడు.

 

"ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి" – 1 పేతురు 5:7

 

ఒక చిన్న పాప అడుకొంటు క్రిందపడిపోవడం వలన తన చేతి వ్రేళ్ళకు గాయం తగిలింది. తన చేతి నొప్పితో ఏడుస్తూ తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది. తన తండ్రి ల్యాప్ టాప్ లో పనిచేస్తూ ఉన్నారు. నాన్న నా చేతి వ్రేళ్ళకు గాయమ తగిలింది నా చేయి నొప్పి పెడుతోంది మందు రాయండి అని ఏడుస్తూ చెప్పింది ఆ పాప. నాన్న దానిని చూసి నేనిప్పుడు పనిలో ఉన్నాను కాబట్టి నేను ఏమి చేయలేను వెళ్లిపో అన్నారు. వెంటనే ఆ బాలిక నాన్న మీరు నా చేతికి మందు వ్రాయకపోయిన పరవాలేదు కాని కొన్ని ఓదార్పు ఇచ్చే మాటలు మాట్లాడి ఉండాల్సింది అని వెక్కి వెక్కి ఏడ్చింది. వెంటనే తండ్రి తన తల నిమురుతో ఓదార్పు ఇచ్చే మాటలు చెప్తూ తన వ్రేళ్ళకు మందు వ్రాసారు. 

 

పరిశుద్ధ గ్రంధంలో 1వ పేతురు 5:7లో ఆయన మిమ్మును గూర్చి చింతించు చున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పుట మనం చూస్తున్నాం. చాలా సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకు విరోధముగా వున్నప్పుడు కలత మనలో చేరినప్పుడు మనలను ఎవరైనా ఓదార్చారా అని ఎదురు చూస్తూ ఉంటాము. కాని. మనలను విచారించుటకు ఒకరు ఉన్నారు. ఆయన మిమ్మును ప్రేమతో విచారిస్తున్నారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మీ చింత యావత్తు అయన మీద వెయ్యండి అని పరిశుద్ధ గ్రంధం చెబుతువుంది. మనుష్యులు మారవచ్చు, తల్లిదండ్రులు కూడా చేయి విడువ వచ్చు. కాని యేసుక్రీస్తు ఎన్నడూ మనలను విడువడు. ఆయన ఎల్లప్పుడు మన పక్షమున ఉంటారు. మీరు ఆయన వైపు చూస్తూ తండ్రి అని పిలిచినప్పుడు ఆయన మీకు జవాబు ఇస్తారు. 

 

ప్రియమైన వారలారా! ఈనాటి వరకు కూడా మనలను మనుష్యులు ప్రేమించాలి అని ఆశ పడుతూ ఉంటాము. కాని నా కుమారుడు, నా కుమార్తె నన్ను ప్రేమించార అని దేవుడు ఎదురు చూస్తున్నారు. దిక్కులేని వారికి ఆయన సహాయకుడు. తల్లి తండ్రియు ఆయనే. ఆయన మనపై ఉంచిన ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడవు ఎంతటిదో మనం గ్రహించలేము. ఆయన మనపై ఉన్న ప్రేమ వలన ఆయన ప్రాణము మన కొరకు అర్పించెను అని పరిశుద్ధ గ్రంధంలో చదువుతున్నాం. మిమ్మును ప్రేమించే ఆయనను మీరు ప్రేమించండి. మీ జీవితం సంతోషంగా మారుతుంది. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.

- సిస్టర్. ఏం. ఏప్సిబా గారు

 

ప్రార్థన అంశం:-

మనం చేస్తూ వస్తున్న వాక్యపు పోస్టర్ల పరిచర్య ద్వారా ఇంటి ముందు అంటించ బడివున్న ఆ వాక్యమును చదివేవారి హృదయంలో దేవుడు కార్యం జరిగించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet instagram unban service tiktok unban instagram unban x unban twitter unban palacebet