By Village Missionary Movement
Friday, 28-Oct-2022దిన ధ్యానము(Telugu) 29.10.2022
అంశం:- యేసు నామంలో విజయం.
"నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును" - యోహాను 14:14
20 సంవత్సరాలు గల లుగ్విట్ కాలు విరిగి పోవడంతో సరిగ్గా నడవలేక పడుకొని కాలాన్ని గడిపేవాడు. ఒక రోజు బైబిల్ చదివేటప్పుడు యోహాను 14:14వ వచనం అతని హృదయాన్ని తాకింది. మళ్ళీ మళ్ళీ ఆ వచనాన్ని చఫువుతూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మని దగ్గరకు పిలిచి దేవుడు నాకు స్వస్థత ఇచ్చి నేను లేచి నడిచేలా చేస్తారా? నా నామంలో మీరు నన్ను ఏమి ఆడిగినను చేస్తారు అన్నారు కదా! ఈ మంచి నాకు చేసి ఆశీర్వదిస్తారని అడిగాడు. వాళ్ళ అమ్మ కూడా విశ్వాసముతో చేతులు కలిపి ప్రార్ధించారు.
లుగ్విట్ విశ్వాసముతో క్రీస్తుని నమ్మడం ప్రారంభించాడు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు అతను తన మంచం మీద నుండి లేచి నడిచాడు. మరియు అతడు పరిగెత్తాడు. 24 ఏళ్ల సమయంలో ఆ యువకుడు బైబిల్ చేతపట్టుకొని ఇండోనేషియాలో ఉన్న సముద్ర ద్వీపానికి మిషనరీగా వెళ్ళాడు. పొపాక్ అని పిలువబడి క్రీస్తు అంటే ఎవరో తెలియని వారికి అతడు తన జీవితంలో అద్భుతాలు చేసిన దేవున్ని ప్రకటించారు. మరియు వారికి దేవుని ప్రేమను రుచి చూపించారు. ఎన్నో కష్టాలను, అడ్డంకులను ఓపికగా భరించి క్రీస్తును బోధించాడు. వారి భాషలో బైబిల్ ను అనువాదించడం ప్రారంభించాడు. అతను 1862 నుండి 1876 వరకు 2000 ఆత్మలను సంపాదించాడు. 1878 లో అతను పొపాక్ భాషలో కొత్త నిబంధనను ప్రచురించాడు. ఆ కొత్త నిబంధన పొందుకున్న సంతోషంలో క్రీస్తులో ప్రజలు రోజు రోజుకు పెరగడం ప్రారంభించారు. ప్రస్తుతం చాలా మంది క్రైస్తవులు ఇండోనేషియాలో సముద్ర ద్వీపములో నివసిస్తున్నారు.
ప్రియమైన వారలారా! మనం ప్రార్దించినప్పుడల్లా దేవుడు వింటాడు మరియు సమాధానం ఇస్తాడు అని నమ్ముతూ ప్రార్ధించాలి. విశ్వాసము లేని ప్రార్థన పనికిరాదు. క్రీస్తు మన కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తాడు అని తెలిసి మనం ప్రార్దించినప్పడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్ద ప్రార్ధించుటకు అర్హతను మనం పొందుకున్నాము. కాబట్టి యేసు నామములో మనం విజ్ఞాపన చేసి విజయ వంతమైన జీవితం జీవిద్దాం. దేవుని కృప మనలను నిలబెట్టును గాక!.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు.
ప్రార్థన అంశం:-
మీడియా పరిచర్యలో పనిచేస్తున్న వ్యక్తులకు దేవుడు అవసరమైన జ్ఞానం ఇచ్చేలా ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250