By Village Missionary Movement
Sunday, 30-Oct-2022దిన ధ్యానము(Telugu) 30.10.2022 (Kids Special)
అంశం:- స్తుతించుట.
“ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” – 1 థెస్సలొనికయులకు 5: 18
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
హాయ్ పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎంతో ఆశక్తిగా చూస్తున్న చిల్డ్రన్ స్పెషల్ వచ్చేసింది. మీరు ఎప్పుడైన యాత్రకు వెళ్ళారా? చాలా జాలిగా సూపర్ గా ఉంటుంది కదా! ఫ్రెండ్స్ తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా! ఇప్పుడు మనం మను అనే ఒక అన్నయ్య గురించి తెలుసుకుందాం సరేనా!
మను అన్నయ్య మరియు తన ఫ్రెండ్స్ విహార యాత్రకు వెళ్ళారంట. అన్ని స్థలాలు చూసి చివరికి ఫ్లవర్ గార్డెన్ నుండి బయటకు వచ్చేసారు. రండి నేను మీ అందరికి ఐస్ క్రీమ్ కొని ఇస్తాను అని అందరికి ఐస్ క్రీమ్ కొని ఇచ్చాడు. ఐస్ క్రీమ్ తింటూ షర్ట్ జోబిలో, ప్యాంట్ జోబిలో పర్సు చూస్తే కనిపించ లేదు. వెంటనే మను యేసయ్య నా ప్యాంట్ జోబి చిరగకుండా నా పర్సు పోయినందుకు నీకు స్తోత్రం అని చెప్పిన మను అన్నయ్యను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏంటి నువ్వు డబ్బులు పోగొట్టుకొని స్తోత్రం అని చెప్తున్నావు మాకు చాలా కోపం వస్తుంది అన్నారు ఫ్రెండ్స్. మధ్యలో ఒకాయన వచ్చి అయ్యా నన్ను క్షమించండి మీ పర్సు ను దొంగిలించి అందులో ఉన్న డబ్బును తీస్తున్నప్పుడు అక్కడ ఒక వాక్యపు అట్ట ఉంది అందులో చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి యున్నాను అని వ్రాసి ఉంది. దేవుడు నాతో మాట్లాడి నట్లు అనిపించింది. దేవుడు నన్ను తన అరచేతిలో పెట్టుకొని చూస్తూ వున్నారు కాబట్టి ఇకపై నేను దొంగతనం చెయ్యను. ఈ దొంగతనమును విడిచి పని చేసి బ్రతుకుతాను అని చెప్పడంతో మను ఫ్రెండ్స్ కు వచ్చిన కోపం ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియలేదు. ఇలా కూడా జరుగుతుందా అన్నట్టు అందరూ చూసారు. ఆ తరువాత వారి సంతోషంలో, దుఃఖంలో , మేలు, కీడు సమయాల్లో దేవునికి స్తోత్రం అని చెప్పడం నేర్చుకున్నారు. ఈనాటి విహార యాత్రలో మనయొక్క మనస్సుకు మాత్రమే సంతోషం కలుగలేదు మా జీవితమునకు కూడా సంతోషం కలిగింది అని ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. వెంటనే మను అన్నయ్య జీసస్ కు థాంక్స్ చెప్పి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయారు. ఏంటి పిల్లలు కధ ఎలా ఉంది సూపరో సూపర్ అని చెప్పేసి వెళ్లిపోకూడదు సరేనా! మీరు కూడా అన్ని విషయాల్లో దేవున్ని స్తుతించాలి సరేనా. కష్టం, నష్టం, సంతోషం, దుఃఖం ఏదైనా సరే జీసస్ ను స్తుతిస్తే చాలు ఎలాంటి ఆటంకమైన ఎదుర్కొని జీవించ వచ్చు. సరేనా! సరే పిల్లలు అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చుకుందమా?.
శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250