Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.10.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 30-Oct-2022

దిన ధ్యానము(Telugu) 31.10.2022 (Youth Special)

 

అంశం:- బానిసత్వం.

 

"అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను" – 1 కోరింథీయులకు 6:12

 

మన జీవితంలో చాలా విషయాలు అప్పుడప్పుడు వస్తు పోతుంటాయి. కాని కొన్ని కార్యాలు అనగా కొన్ని పాపములు మనలను బానిసలుగా చేసుకొని బానిసత్వానికి గురి చేస్తుంటాయి. మనం ఇటువంటి బానిసత్వంలో ఉన్నాము అని గ్రహింపు కూడా లేకుండా మన మనస్సును అపవాది గ్రుడ్డిగా మార్చేస్తుంది. అందులో ఒక విషయాన్ని గురించి ఈరోజు ఆలోచింది చూద్దాం. 

 

ఈ కాలంలో అనేక మంది యవ్వనస్తులు మొబైల్ ఫోన్ కు బానిసలుగా ఉన్నారు. ఉదయం లేచిన వెంటనే చూసేది దేవుడనా లేక మొబైల్ నా అని అడిగితే 90% మొబైల్ ని అని జవాబు వస్తుంది. ఏదైనా కారణంతో లేదా ఎటువంటి కారణం లేకుండానే ఒక రోజు సమయంలో చాలా గంటల సమయం మొబైల్ తో సమయం గడుపుతున్నాం. సరే ఈ అడిక్షన్ నుండి ఎలా బయటపడాలి? నేను విడిచి పెట్టాలి అని అనుకొంటున్నాను కాని విడచి పెట్టలేక పోతున్నాను అని బాధ పడుతున్నారా? మన దేవుడు మిమ్మును విడిపించుటకు సిద్ధంగా ఉన్నారు. 

 

నేను బానిసత్వంలో వున్నాను అనే గ్రహింపు ఉంటే చాలు మీరు ఖచ్చితంగా దానిని జయించ గలరు. సెల్ఫ్ కౌంట్రోల్ తో జీవించుటకు దేవుని యొద్ద బలమును అడగండి. ఒక ప్రముఖ్యమైన విషయాన్ని చూచుటకు మొబైల్ తీసినట్లు అయితే దానిని మాత్రమే చూడండి. టైం పాస్ కోసం అనవసరమైన వాటిని చూడను అని నిర్ణయం తీసుకోండి. దావీదు ఊరియా భార్యను చూచుటకు మిద్దె మీదకు వెళ్ళలేదు. మిద్దె మీద నడుచుచు ఉన్నప్పుడు బేత్షెబను చూసి పాపములో పడిపోయాడు. ముఖ్యముగా తన కొరకు నియమించబడిన పనిని చేయకుండా ఇంట్లో పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు. పడుకొని లేచాక టైమ్ పాస్ కోసం మిద్దె మీదకు వెళ్ళాడు. అక్కడ తన కన్నులు తనకు ఉచ్చుగా మారాయి. 

 

యవ్వనురాల నీ యవ్వన కాల మందు నీకు అప్పగించబడిన పనిని లేదా విద్యను చక్కగా పూర్తి చెయ్యు. టైమ్ పాస్ అవ్వాలి అని నువ్వు మొబైల్ లో సాధారణమైనవే చూస్తావు కాని తరువాత వాటిని క్రమముగా చూస్తూనే చివరికి పాపములో పడిపోయే అవకాశం ఉంది అనే విషయాన్ని మరచిపోవద్దు. 

 

ఒక వేళ నీవు ఏదో ఒక పాపములో బానిసలుగా అయిపోతే ప్రభువుకు బహిరంగంగా తెలియజేయు. ఉపవాసం ఉండి ప్రార్దించి విడుదల పొందుకొనుటకై పోరాడు. నీ మైండ్ లో నుండి మొబైల్ ను తీసివేయాలి అని అనిపించినప్పుడే మొబైల్ ను రిజక్ట్ చెయ్యు. ఉన్నది ఒకటే జీవితం దానిని బానిసత్వపు జీవితానికి అమ్మి వేయకుండా క్రీస్తులో విజయవంతముగా జీవించుటకు తీర్మానం తీసుకో. హల్లేలూయా!

- శ్రీమతి. దివ్య ఫెర్నర్డ్ గారు

 

ప్రార్థన అంశం:-

సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయ బడుతున్న కార్యక్రమాలు దేవుని ఎరుగని ప్రజలకు చేరేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet