Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.11.2022
Share:

By Village Missionary Movement

Thursday, 03-Nov-2022

దిన ధ్యానము(Telugu) 04.11.2022

 

అంశం:- వేచి వుండుడి.

 

"ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును" - హబక్కూకు 2:3

 

పాపము నుండి విడుదల పొందుకొని ఒకరు తన కుటుంబాన్ని విడిచి పెట్టి ఉత్తర భారత దేశంలో ఆదివాసీ ప్రజల మధ్య సేవ చేయుటకు తనను తాను సమర్పించు కొని మిషనరీగా వెళ్లారు. తన పరిచర్యలో 5 యేళ్లుగా చెవిటి వారిగా ఉన్న ఒక తల్లి తప్ప మరి ఎవరు ఏ ఆత్మ కూడా రాలేదు. ఒక రోజు కృంగిపోయి ఇక పై ఏమి వద్దు అనుకొని తన స్వదేశానికి వెళ్లిపోవాలి అని నిర్ణయించు కున్నారు. హఠాత్తుగా ఒక రోజు ఆ తల్లి మరణించింది అనే వార్త వస్తుంది. అయిన ఆ తల్లి క్రైస్తవ సమాదిలొనే పాతి పెట్టాలి అని తన కుటుంబీకులను అడిగి ఒక మిషనరీని పిలిపించారు. ఇతను కూడా అక్కడికి వెళ్లి కన్నీటితో నిలబడ్డారు. ప్రభువు క్రియ జరిగించడం ప్రారంభించారు. ఈయన ప్రార్ధిచడం మొదలు పెట్టిన వెంటనే దేవుడు ఆ తల్లిని ప్రాణాలతో లేపారు. ఆ సంఘటన చూసిన ఆ గ్రామమే రక్షణ పొందుకుంది. ఆ మిషనరీ అంతా ముగిసిపోయింది అనుకున్న సమయంలో దేవుడు విజయ వంతంగా పూర్తి చేశారు.

 

నిరీక్షణ యొక్క అనుభవాన్ని దేవుని పిల్లల యొక్క జీవితంలో ఏదో ఒక సమయంలో తప్పక అధిగమించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు విజయం ఇచ్చేది దేవుని సన్నిధి. పరిశుద్ధ గ్రంధంలో దేవుని కొరకు వేచి ఉన్న వారి జీవితం ముగింపు వరకు తలదించుకొనే పరిస్థితులు ప్రభువు అనుమతించ లేదు. అందరూ వేచి ఉండి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. అబ్రాహాము తన వాగ్దానం నెరవేర్పుపు కొరకు చాలా సంవత్సరాలు వేచి ఉన్నారు. చివరికి ముగింపు సంతోష కరమైన ఆశీర్వదం. లాజరు చనిపోయాడు అని యేసుక్రీస్తు ఆలస్యం చేయ లేదు. కాని చివరిగా దేవుని నామం మహిమ పరచబడాలి అని అక్కడ ఒక అద్భుతం చేశారు. 

 

ప్రియమైన వారలారా ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, అప్పు వంటి విషయాల్లో దేవుడు మీకు వేచి ఉండవలసిన పరిస్థితి అనుమతించారా అయితే కృంగిపోవద్దు. దేవుని సన్నిధి మరియు పరిశుద్ధ గ్రంధం మీకు ఓదార్పు నిస్తుంది. ఆయన అలస్యం అయిన గాని సరైన కాలంలో మనం ఊహించని కాలంలో ఆయన కార్యం చేస్తారు. అవి చూచుటకు మన కన్నులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. హల్లేలూయా!

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఉజ్జీవపు శిష్యుల కూటమిలో పాలు పొందుతున్న యవ్వనులు తీసుకున్న తీర్మాణములో వారు నిలకడగా ఉండు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon grandpashabet palacebet sonbahis wbahis grandpashabet betpuan betsalvador matbet meritking