Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.11.2022
Share:

By Village Missionary Movement

Friday, 04-Nov-2022

దిన ధ్యానము(Telugu) 05.11.2022

 

అంశం:- మౌనముగా ఉంటే వచ్చే ఆశీర్వాదం.

 

"నేను మీతో చెప్పునదేమనగా, మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి" - మత్తయి 5:44

 

తరంగ బాడీ వద్ద ఒక విధవరాలుకు న్యాయం చెయ్యాలి అని సిగన్ పై హసియస్ కోపపడ్డారు. సిగన్ యొక్క మిషనరీ స్థాపనం యొక్క ఉత్సాహాన్ని తగ్గించి సేవను విడిచిపెట్టి వెనుదిరిగేలా చెయ్యాలి అనే ఆలోచనతో వారిని అనేక రకాల అవమానాలకు గురి చేసాడు. ఎటువంటి కారణం లేని మిక్కిలి అల్పమైన కార్యాలకు సాకులు చెబుతూ 1708 వ సంవత్సరం నవంబర్ నెల తుపాకీ పట్టుకున్న పోలీసు సిగన్ వాళ్ళ ఇంట్లో చొరబడి ప్రార్ధన చేస్తున్న అతన్ని బంధించి గవర్నర్ ముందు నిలబెట్టాడు. తప్పుడు సాక్షుల వలన సిగన్ జైలులో బందించబడ్డాడు.అతనిని కొట్టి కుక్క అని తిట్టారు. అంతటితో తృపి చెందకుండా కొరడాతో కొడతాను అని బెదిరించి దుర్భాశాలు ఆడాడు. రోజు రోజుకు మిషనరీ దర్శనము దిగజారిపోతున్నప్పటికి అతను నిరుత్సాహ పడలేదు. 4 నెలలు చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు జర్మన్ సైనికులు కిటికీ లోనుండి కాగితం, పెన్ను, ఇంక్ ను సిగన్ కు ఇచ్చి సహాయం చేయడంతో థ గాడ్ ప్లిసింగ్ స్టేట్ ఆఫ్ ఏ క్రిస్టియన్, థ గాడ్ ప్లిసింగ్ ప్రొఫెసన్ ఆఫ్ టీచింగ్ అనే రెండు చిన్న పుస్తకాలను ఆయన వ్రాసారు. 

 

దావీదు రాజు తన సొంత కుమారుడైన అబ్షాలోముచే తరిమి వేయబడినప్పుడు రహస్యమైన స్థలమునకు వెళ్లారు. అప్పుడు షిమీ దావీదును చూసి నరహంతకుడా, దుర్మార్గడా ఛీ పో అని శపించి నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్క బడి వున్నావు అని చెబుతూ రాళ్లు రువ్వి తరిమాడు. కాని దావీదు మౌనముగా వెళ్లిపోయాడు. అప్పుడు అభిసై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువైన నిన్ను శపింపనేల నీ చిత్తం అయితే నేను వాడిని చేరి వాడి తలను ఛేదించి వచ్చెదననెను. అప్పుడు దావీదు కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ జూచుచుండగా ఈ బెన్యామీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యం. యెహోవా వాడికి సెలవిచ్చి యున్నాడు గనుక వానిని శపింప నియ్యుడి యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అనెను. దావీదు మరల సింహాసనమునకు వచ్చినప్పడు షిమీ దావీదు రాజును ఎదుర్కొని రాజా నన్ను క్షమించుము అని సాష్టాంగ పడ్డాడు. 

 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! మీ జీవితంలో సమస్యలు, పోరాటములు సందించుటకు ఇలా అనేక మైన కార్యాలు ఎదురుపడవచ్చు. మీరు ఏ తప్పు చేయనప్పటికి మిమ్మును అనేకులు దూషించవచ్చు. వాటి గురించి ఎప్పుడు కృంగిపోవద్దు. సిగన్ కు విరోధముగా అధికారులు లేచారు దూషించి మాట్లాడారు అయిన గాని అతను మౌనముగా ఉన్నారు. అతనికి చివరిలో దేవుడు మేలు కలుగజేశారు. రాజైన దావీదునకు వ్యతిరేకంగా షిమీ లేచాడు కాని సమయం వచ్చినప్పుడు నిందకు బదులుగా మేలు కలిగింది. మీరు కూడా ఇతరులు మిమ్మును దూషించినప్పుడు మౌనముగా ఉంటే మేలులను పొందు కుంటారు. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమెన్.

- బ్రదర్. పి.స్టీవ్ మ్యా  

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతటిలో తమిళనాడులో 40 స్థలాల్లో యవ్వనుల కొరకు జరగబోతున్న ప్రత్యేక కూడికలను దేవుడు ఆశీర్వదించు లాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet