Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.11.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 05-Nov-2022

దిన ధ్యానము(Telugu) 06.11.2022 (Kids Special)

 

అంశం:- సువాసన

 

"సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము" - ఎఫెసీయులకు 2:10

 

హాలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమముగా ఉండాలి అని దేవున్ని ప్రార్థిస్తున్నాను. ప్రతి రోజు మనలను క్షేమముగా కాపాడుతున్న యేసయ్యకు థాంక్స్ చెప్పడం మర్చిపోకూడదు. ఒకే నా పిల్లలు. కధ వినడానికి రేడీయేనా? 

 

రోడ్డు వసతి లేని ఒక అందమైన చిన్న గ్రామము ఉండేది. ఆ గ్రామములో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు గల ఒక పాఠశాల కూడా ఉండేది. అక్కడ మధ్యాహ్నం భోజనం పెడతారు. ఓహ్ మీ స్కూల్లో కూడా మధ్యాహ్నం భోజనం పెడతారా సూపర్. అక్కడ పెట్టిన ఆహారం కొరకు విక్కీ ప్రతి రోజు థాంక్స్ చెప్పిన తరువాతే తింటాడు. మీరు కూడా భోజనం చేసేటప్పుడు థాంక్స్ చెబుతారా చెప్పరా? కచ్చితంగా చెప్పాలి పిల్లలు ఓకేనా! విక్కీ ప్రార్థన చేసి తినడం చూసిన ఇద్దరు విద్యార్థులు హేళన చేస్తూ ఉండేవారు. విడు ప్రార్థిస్తే ఈ అన్నం, సాంబారు బిర్యానీలా మారుతుందేమో చూద్దాం అని నవ్వుతూ ఉండేవారు. అప్పుడు అ స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి పిల్లలు భోజనం తిన్నారా? భోజనం బాగుందా అని అడిగారు. ఆహారాన్ని వృధా చెయ్యకుండా చక్కగా తినాలి అని విద్యార్థులకు చెప్పారు. ప్రిన్సిపాల్ ను చూసిన వెంటనే విక్కీని హేళన చేస్తున్న విద్యార్థులు అందరూ సైలెంట్ అయిపోయారు. ఏంటి ఇక్కడ ఏదో పండగ జరుగుతున్నట్లు నవ్వుతూ ఉన్నారు అని ప్రిన్సిపాల్ అడగడంతో ఒక విద్యార్థి లేచి సార్ విక్కీ ప్రతి రోజు ప్రార్థన చేసి తింటాడు అందుకే అలా నవ్వుతున్నాము అని చెప్పాడు. ఏంటి ప్రార్థన చేయడం చూసి నవ్వుతున్నారా? విక్కీ చదువులో, క్రమశిక్షణలో ఎంత మంచి విద్యార్థో చూసారా తాను ప్రార్థన చేసి ఏదైనా చెయ్యడం వలన మంచి విద్యార్థిగా ఉన్నాడు అని సార్ చెప్పుటను విన్న విద్యార్దులు తమ తప్పును గ్రహించారు. ఇకపై విక్కీ వలె ఉండాలి అని అందరికి ఆశ కలిగింది. మరుసటి రోజునుండి ఆహారం కొరకు అందరూ దేవునికి థాంక్స్ చెప్పారు. ఆ ప్రిన్సిపాల్ సార్ ఏదో ఆలోచిస్తూ వెళ్లిపోయారు. అతను కూడా యేసయ్యను ఎరిగి ఉండి ఏ ఒక్కరోజు భోజనము కొరకు ప్రార్థన చెయ్యలేదు అని గ్రహించారు. అతనిలో కూడా ఒక మార్పు వచ్చింది. విక్కీ యొక్క మంచి గుణం అనేకులకు యేసయ్య చెంతకు ఆకర్షించింది. 

 

ప్రియమైన పిల్లాలరా! ఈ కథలో హీరో అయిన విక్కీ వలె మీరు కూడా సువాసన ఇచ్చే గంధపు చెక్కవలె జీవించి నప్పుడు మీ చుట్టూ వున్న స్నేహితులు యేసయ్య ను తెలుసుకుంటారు. ఏంటి పిల్లలు యేసయ్య కూడా చాలా సంతోషిస్తారు కదా. మరి మీరు ఆయనను సంతోష పరచడానికి రెడీయేనా. సూపర్. సరే పిల్లలు మనం ఇప్పుడు ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకుందమా. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis wbahis grandpashabet betgit betsalvador matbet meritking