Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.11.2022
Share:

By Village Missionary Movement

Saturday, 12-Nov-2022

దిన ధ్యానము(Telugu) 13.11.2022

 

అంశం:- సృష్టి కర్త

 

“సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను” - కొలస్సీయులకు 1:16

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

రేమంత్ తన చిన్న పాపతో కలిసి షాపింగ్ కు వెళ్లాలి అని బయలుదేరుతూ ఉన్నాడు. రీనా కూడా చాలా సంతోషంగా నేను షాపింగ్ కి వెళ్తాను నేను ఆడిగినవాన్నీ నాన్న నాకు కొని ఇస్తారు . హాయ్ జాలి అంటూ గెంతులు వేస్తూ అమ్మకు బాయ్ చెప్పింది. పిల్లలు మీకు కూడా అమ్మతో కలిసి షాపింగ్ కు వెళ్ళడం అంటే చాలా ఇష్టమా? ఒకే. కాని అల్లరి చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు సరేనా! మీరందరూ చాలా మంచి పిల్లలు కదూ! 

 

రేమంత్ అంకుల్ కొంచం దూరం తన కార్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక చప్పుడుతో కారు ఆగిపోయింది. కారు దిగి ఏం చేసినా సరే అది కదలలేదు. రీనా సంతోషం అంతా బుస్సుమని పోయింది. కొద్దిసేపటి తరువాత కర్ర పట్టుకొని నడుచుకొంటూ వచ్చిన తాతయ్య నేను ఏమైనా సహాయం చెయ్యనా అని అడిగాడు. రేమంత్ అంకుల్ అతని వైపు పైకి క్రిందకు చూసి ఈయన మనకు ఏం సహాయం చేస్తారు అనుకొని లేదు నేను చూసుకుంటాను అన్నారు. మరలా ఏదేదో చేశారు కాని కార్ స్టార్ట్ అవ్వలేదు. నాన్న నాకు బోర్ కొడుతుంది అని చెప్పిన రీనా మాటలను విన్న రేమంత్ అంకుల్ కు చాలా బాధ అనిపించింది. వాకింగ్ కు వెళ్లి తిరిగి వచ్చిన తాతయ్య మరల నేను ఏదైనా సహాయం చెయ్యనా? అని అడిగారు. 

 

అలసిపోయిన రేమంత్ అకుంల్ సరే అనే లోపే రీనా ఒకే తాతయ్య మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పింది. కొన్ని నిమిషాల్లో రిపేర్ చేసేసారు. తరువాత కార్ స్టార్ట్ అయ్యింది. వెంటనే నాన్నకు తెలియంది తాతయ్య తెలుసు అన్నట్లు చూసింది రీనా. ఆ కారును తయారు చేసింది తాతయ్యే అందువలన అంత సులువుగా రిపేర్ చేసేసారు. రేమంత్ అంకుల్ తాతయ్య కు థాంక్స్ చెప్పారు. మీ పేరు ఏమిటి అని అడిగితే అతను హేన్రి ఆగ్ పోర్ట్ అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆయన చెప్పినది అంతా అర్ధం అయ్యింది. కృతజ్ఞత పూర్వకంగా థాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు రేమంత్ అంకుల్. తండ్రి తన కుమార్తెతో మాట్లాడం మొదలుపెట్టారు. ఈవిధముగానే మనకు ఏర్పడిన కష్ట తరమైన పరిస్థితులను సృష్టి కర్త అయిన యేసయ్య తో చెప్పినప్పుడు ఆయన చాలా సులువుగా బాగుచేస్తారు. ఏంటి రీనా నాన్న చెప్పింది అర్థం అయ్యిందా? అని మాట్లాడుతూ ఉండగానే మార్కెట్ వచ్చేసింది. రీనాకు చిన్న సండే క్లాస్ కు వెళ్లినట్లు అనిపించింది. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి నన్ను చూసుకొనుటకు ఎవరు లేరు నాకు సహాయం చేయుటకు, అవసరతలు. తీర్చుటకు ఎవరు లేరు అని అనుకొంటున్నారా? నిన్ను సృజించిన దేవుడు ఉన్నారు. నీ స్థితి ఏదైనా ఆయన బాగుచేస్తారు. బాధపడవద్దు సరేనా! 

సరే కంఠత వాక్యం నేర్చు కొందమా! 

- శ్రీమతి. జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş