Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.11.2022
Share:

By Village Missionary Movement

Friday, 18-Nov-2022

దిన ధ్యానము(Telugu) 19.11.2022

 

అంశం:- పడవ వెళ్తుంది.

 

"ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు" - మత్తయి 16:26

 

సమస్తమును నేర్చుకున్న ఒక జ్ఞాని ఒక నదిని దాటి వెళ్ళవలసి వచ్చింది. అతడు ప్రయాణిస్తున్న సమయంలో పడవ నడుపుతున్న అతనితో మాట్లాడుతున్నాడు. తన యొక్క జ్ఞానం అతనికి కనపరచాలి అనుకొని అతనితో నీకు తత్వ జ్ఞానం మరియు గ్రంధాలు గురించి తెలుసా అని అడిగారు. అందుకు అతను తెలియదు అని జవాబు ఇచ్చాడు. అందుకు ఆ జ్ఞాని నీ జీవితంలో ముప్పావు వంతును కోల్పోయావు అన్నారు. వారిద్దరూ ఇలా మాట్లాడు తుండగా పడవ యొక్క అడుగు భాగమున చిన్న రంద్రం నుండి లోపలికి నీరు రావడం మొదలైయింది. వెంటనే ఆ పడవను నడుపుతున్న ఆ వ్యక్తి అయ్యా కాసేపటిలో పడవ మునిగిపోతుంది మీకు ఈత కొట్టడం వచ్చా అని అడిగారు. నాకు రాదు అని జ్ఞాని బయపడడంతో అయ్యో మీరు అన్నీ నేర్చుకొని జీవితమునకు అవసరమైన దానిని నేర్చుకోలేదు. ఇప్పుడు మీరు జీవితాన్నే కోల్పోతున్నారు. అయ్యా నన్ను క్షమించండి నాకు ఈదడం తెలుసు నేను నా ప్రాణమును కాపాడుకొంటాను అని చెప్పి నదిలోకి దూకేశాడు. అవును ఇదే విధంగా పరిశుద్ధ గ్రంధంలో సొలోమోను సమస్తమును ఎరిగిన జ్ఞాని అని మనం చూస్తున్నాం. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు అని సొలొమోను గూర్చి పరిశుద్ధ గ్రంధమే చెబుతుంది. ఆకాశం క్రింద జరిగే ప్రతి దానిని చూడటానికి అతడు ఇష్టపడ్డాడు. కాని తన జీవితం గురించి జాగ్రత్త లేకుండా అతని జీవితం చీకటి మయం కావడం మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంధమునకు విరోధముగా 1000 మందిని పెండ్లి చేసుకున్నాడు. వారిని సంతోష పరుచుటకు విగ్రహాలను మరియు కోవెలలను కట్టించాడు. చివరిగా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పి ముగిస్తున్నాడు. కాని తన తండ్రి అయిన దావీదు ఆశీర్వాదములలో రాజా పదవి లోనుండి దారి తప్పిపోకుండా నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ. జ్ఞానమే గొప్పది అని మరలా మరలా చెప్పుటను మనం చూడగలం. చివరి వరకు దావీదు దేవున్ని పట్టుకున్నాడు.

 

ప్రియమైన వారలారా! ఈలోకంలో పేరు ప్రసిద్ధి డిగ్రీలు అని పరిగెడుతున్నారా? వీటన్నింటికి ప్రాముఖ్యత ఇచ్చి మీ కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆలోచించండి. మీ ఆత్మకు ఇచ్చే ప్రాముఖ్యత ఎంత శాతం అనే విషయాన్ని గూర్చి ఆలోచించండి. వీటి కొరకు జీవించే జీవితం చివరిలో విసుకుతో నిండిపోతుంది. కాని దేవునికి మొదటి స్థానం ఇచ్చే జీవితం, దేవుని కొరకు జీవించే జీవితం ఎల్లప్పుడు ఆనందం, నిత్యజీవమును ఇస్తుంది. అవును జీవితం అనే పడవ ఎల్లప్పుడు కావాలి అంటే అది ఎప్పుడైనా మునిగిపోవచ్చు. అదే మనం దేవునితో కూడా ఉన్నట్లు అయితే ఆయన మనలను నిత్యజీవపు ఒడ్డునకు చేర్చుతారు. ఆమెన్.

- శ్రీమతి. మంజులా గారు

 

ప్రార్థన అంశం:-

ఆకలి గొనిన వారికి ఆహారం అందించే కార్యక్రమం ద్వారా సందించ బడుతున్న ప్రజలు యేసుని కనుగొనేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler meritking meritking giriş meritking güncel giriş alobet alobet giriş nakitbahis Betpark milanbahis nakitbahis online casino online casino perabet perabet giriş perabet perabet giriş bahsegel jojobet perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş