Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.11.2022 (Youth Special)
Share:

By Village Missionary Movement

Sunday, 20-Nov-2022

దిన ధ్యానము(Telugu) 21.11.2022 (Youth Special)

 

యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన సందేశం

 

అంశం:- పడినను లేస్తాను.

 

"నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు" - కీర్తనలు 32:5

 

పాపపు బురదలో పడి వున్నప్పటికి కూడా దేవుని హస్తాలలో ఖడ్గం వలె వాడబడి జీవించగలం అనడానికి ఉదాహరణే రాహాబు. ఈ రాహాబు యెరికో పట్టణములో సుఖముగా జీవిస్తూ వస్తున్న వేశ్య అని పరిశుద్ధ గ్రంధం మనకు పరిచయం చేస్తుంది. యవ్వన కాలంలో మనకు నచ్చినట్లు జీవించి అందరూ చూసి తృణీకరించే పాపమును రాహాబు చేసింది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించు కొంటు వచ్చిన యెహోషువ యెరికోను వేగు చూచుటకు ఇద్దరు మనుష్యులను పంపిస్తాడు. వారు ఈ రాహాబు ఇంటికి వెళ్తారు. ఆ సంగతి యెరికో రాజుకు తెలియడం వలన మనుష్యుల ను పంపి విచారిస్తాడు. రాహాబు వారిని అప్పజెప్పకుండా దాచి పెడుతోంది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, క్రింద భూమి యందును దేవుడే అని దేవుని యందు తీరని దాహం కలిగిన రాహాబు వలె మారింది. విన్న అద్బుతములను మనస్సులో ఉంచుకొని నిజమైన దేవున్ని కనుగొన్నది. యెరికో కోట నాశనం అయిన నా కుటుంబమును కచ్చితంగా కాపాడతారు అనే విశ్వాసము మాత్రమే కాదు పాపపు జీవితమును ద్వేషించి పరిశుద్ధ జీవితమును జీవించుటకు కూడా సహాయం చేస్తారు అనే ఆశ నమ్మకం ఆమె హృదయంలో ఉండేవి. యెరికో కోట కూలి నేల పాలైనప్పుడు ఆ కోట మీద ఉన్న రాహాబు ఇల్లు మాత్రం కూలిపోకుండా నిలబడింది. తనని నమ్మి వచ్చిన ఎవరిని విడువని దేవుడు రాహాబు జీవితంలో నూతన కార్యం జరిగించారు. హెబ్రీ 11:31 లో ఉన్న విశ్వాసులు వీరుల జాబితాలో చోటు సంపాదించు కున్నది. అది మాత్రమే కాదు మత్తయి సువార్త 1:5లో యేసుక్రీస్తు పుట్టిన వంశంలో స్థానం సంపాదించుకున్నది. ఇది ఎలా సాధ్యం అవుతుంది. రాహాబు ప్రారంభంలో పాపములో మునిగి ఉన్నది అని విషయం నిజమే. కాని పరిశుద్ధ దేవున్ని కనుగొన్న తరువాత ఆమె జీవితం మారి యేసును కనిన చరిత్ర సృష్టించిన రాహాబు వలె మారింది. ప్రియమైన యవ్వనులారా! యవ్వనంలో పాపములు పడి లేవలేక పోరాడుతున్నారా యేసు వైపు చూడండి. ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. పరమ కుమ్మరి యొద్ద మీ జీవితమును సమర్పించు కొన్నట్లు అయితే మీ జీవితం అనేకులకు సాక్షిగా మార్చి మిమ్మును హెచ్చించుటకు దేవుడు మీ కొరకు వేచి ఉన్నారు. హల్లేలూయా!

- శ్రీమతి. జీవా విజయ్ గారు.

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో మే 1న జరగబోయే యవ్వనస్తులు కూటములో పాల్గొంటున్న ప్రతి యవ్వనస్తులను దేవుడు మహిమ కరముగా వాడుకొనేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet