Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.11.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 23-Nov-2022

దిన ధ్యానము(Telugu) 23.11.2022

 

అంశం:- వాక్యమే దేవుడు.

 

“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది” - కీర్తనలు 119:105

 

హఠాత్తుగా జరిగిన ప్రమాదం వలన బాబు అనే ఒక బాలుడు తన కంటి చూపును కోల్పోయాడు. అప్పటి నుండి చుట్టూ చీకట్లు కమ్మడం వలన ఎప్పుడు అరుస్తూ తన చేతికి దొరికినవి విసిరేస్తూ ఉండేవాడు. ఒక రోజు అక్కడికి సువార్త ప్రకటించడానికి వచ్చిన వ్యక్తి ఆ బాబుతో దయగా శ్రద్ధగా మాట్లాడారు. ఆ సమయంలో బాబుతో ప్రశాంతంగా మాట్లాడటం చూసిన తల్లిదండ్రులు ఆ వ్యక్తిని రోజు రావాలి అని కోరారు. వారం రోజుల్లోనే బాబు తన పరిస్థితిని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఒక్క వారంలోనే మా బాబును ఎలా మార్చ గలిగారు అని అడిగినప్పుడు దానికి అతడు నేను కూడా గ్రుడ్డివాడినే యేసుక్రీస్తు మాటలు నాకు వెలుగు ఇచ్చాయి. నన్ను నడిపించి నా గాయములను నయం చేసాయి. బాబు కూడా ఇప్పుడు ఆ వెలుగునే చూస్తున్నాడు కాబట్టి తాను సంతోషంగా ఉన్నాడు అన్నారు. ఈనాటి బిజీ అయిన జీవితంలో బైబిల్ ను ఇంటి అలమరలో మరియు సెల్ ఫోన్ లో ఉంచుకొని చదవడానికి సమయం లేదు అని అంటుంటాము. అందుకే చిన్న చిక్కు కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టేసి అడవిలో వదిలేసినట్లు బయపడుతుంటాము. ఆకాశము భూమి గతించిపోవును గాని మాటలు గతియించవు అని నేను మీతో చెప్పుచున్నాను. చిన్న అక్షరమైన లేదా అక్షరములో చిన్న భాగం అయిన నెరవేరును అని యేసుక్రీస్తు చెప్పిన మాటలు తెలిసినప్పటికి మనం వాటిని చదవడం లేదు. ఒక వేళ చదివినను మనం వాటిని ధ్యానించడం లేదు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించు వాడు ధన్యుడు. ఎందుకు అంటే మన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు మరియు అనుసరించడానికి కావాల్సిన వెలుగు పరిశుద్ధ గ్రంధం నుండి మనకు అందుబాటులో ఉంది. కావున ధర్మశాస్త్రము నందు అందించు వాడు పడినను అడ్డంకులు వచ్చినను రక్షణను కాపాడుకొనే వాడిగా ముందుకు సాగుతాడు. దీనిని వింటున్న ప్రియమైన వారలారా మన ప్రయాణాల్లో దారిని చూపడానికి గూగుల్ మ్యాప్స్ అనేక మార్గాలు ఉన్నప్పటికి జీవితంలో క్రీస్తు వైపు సాగే మన ప్రయాణంలో సరి అయిన మార్గదర్శి బైబిల్ మాత్రమే. మనం నిస్సహాయంగా ఉన్న సమయంలో బైబిల్ మనకు మార్గం చూపుతుంది. మరియు జీవితంలో ఆనందాన్ని కలుగజేస్తుంది. బైబిల్ ను మన చేతిలో కాకుండా మన హృదయంలో ఉండనిద్దాం. మన జీవితాలను ప్రకాశింప నిద్దాం. హల్లేలూయా!

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు.

 

ప్రార్థన అంశం:-

ఉజ్జీవమును ఆశించే వారి కూటములో పాల్గొన్న వారు దేవుని కొరకు ఏదైనా చేసే వారిగా మారేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet