Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.11.2022
Share:

By Village Missionary Movement

Thursday, 24-Nov-2022

దిన ధ్యానము(Telugu) 24.11.2022

 

అంశం:- మంచితనము.

 

"వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది" - ఎఫెసీయులకు 5:9

 

హానికరం అనిపించే వాటిని నివారించడం మాత్రమే కాదు ఇతరులకు వారి ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా మనకు వీలైనంత సహాయం చెయ్యడమే మంచితనం. మనం మన యొక్క మంచి ప్రవర్తనలు మరియు మన యొక్క క్రియలు అన్నింటిలో మన మంచి తనాన్ని వ్యక్తపరచాలి. నేడు ధర్మం అనే ఈ మంచి తనం సాధారణంగా అన్ని మతాలలో కనిపిస్తుంది. ఒక సారి నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా ఎదురుగా ఒక అన్య మతస్తుడు కారుపై చెడుకు బదులుగా మంచి చెయ్యి అని వ్రాసాడు. వారు అనేక మంచి పనులు చేస్తూ ఉంటారు. అంతే కాదు వారి ఆత్మలో సంతృప్తిని మరియు ఆనందాన్ని పొందుతారు. కాని యేసుక్రీస్తు ను ఎరిగి ఈ లోకంలో ఆయనతో జీవిస్తున్న మన యొక్క గుణం మంచితనముగా మారి మన చుట్టూ వున్న సమాజానికి సహజంగా సహాయం చేయుటకు మనం ప్రేరేపించబడాలి. ఆమె సత్ క్రియలను మరియు ధర్మ కార్యములను బహుగా చేసి యుండెను. అని అపోస్తుల కార్యములు 9:36లో వ్రాయబడి ఉన్నది. రూతు కూడా మంచితనముతో నిండినదై నడుచుకొనుట వలన ఊరందరు ఆమెను యోగ్యురాలు అని ఎరిగి యుండెను. మత్తయి సువార్త 5:3-16 వచనాల్లో యేసుక్రీస్తు చెప్పిన లక్షణాలు అన్నీ మనలను ధన్యులుగా లేదా మంచితనం నిండిన వారిగా జీవించేలా చేస్తాయి. పరిశుద్ధ గ్రంధంలో ఆత్మ ఫలాలు అని కాదు గాని ఆత్మఫలం అని ఏక వచనంలో చెప్పబడి ఉన్నది. ఒక ఫలం వాసన, రుచి, దృఢత్వం, తేమ, మృదుత్వం, రంగు ఆకారం మరియు ఖనిజాలు కలిగి ఉన్నట్లే ఆధ్యాత్మిక ఫలాలు యొక్క 9 లక్షణాలు మన జీవితంలో కనిపించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఇటలీలో జన్మించిన తల్లి ఫ్లోరెన్స్. క్రీస్తు యొక్క మంచితనం మరియు దయతో నిండిన వారై ఉన్నారు. వ్యాధులతో బాధింప బడిన వారిని మరియు పేద మరియు సామాన్య ప్రజలను చూసి ఆమె గుండె పగిలిపోయింది. 16 సంవత్సరాల వయస్సులో ఆమె నర్సింగ్ కలశాలలో చేరారు. 1854లో ఐరోపాలో జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులను దయతో రక్షించారు. తన అవసరాన్ని పొగడి విక్టోరియా రాణి ఇచ్చిన బారి మొత్తాన్ని పేదల కొరకు నర్సింగ్ స్కూల్ ప్రారంభించి ఎంతో మందిని బ్రతికించింది. ఆమె యొక్క దయ మరియు ప్రేమ చాలా మంది హృదయాలను తాకింది. దేవుని బిడ్డలుగా ఏర్పరచబడిన వారిగా ఏదైనా మంచి పనులు చేయడానికి అర్హత పొందాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ప్రియమైన వారలారా! మనలో ఉన్న మంచితనాన్ని చూసి ప్రజలు దేవున్ని మహిమ పరచాలి. 

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు

 

ప్రార్థన అంశం:-

ఫిలిప్ గాస్పెల్ టీం ద్వారా ప్రతి వారం సంధింప బడిన నూతన గ్రామాల్లో ఉన్న ప్రజలు యేసుని అంగీకరించేలా ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet