By Village Missionary Movement
Friday, 25-Nov-2022దిన ధ్యానము(Telugu) 25.11.2022
అంశం:- లేచి ప్రకాశించుము.
"ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను" – 2 తిమోతికి 1:6
ఒకానొకప్పుడు ఒక పాఠశాలను చూడటానికి ఒక ప్రముఖ వ్యక్తి అక్కడకు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యా యుడు ఒక విద్యార్థిని చూపించి మా పాఠశాలలో వీడొక్కడే తెలివి తక్కువ వాడు అని చెప్పినప్పుడు మిగతా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ నవ్వారు. కొంచం సమయం తరువాత ఆ ప్రముఖ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ తెలివి తక్కువ విద్యార్థిని స్కూల్ కాంపౌండ్ వరకు తీసుకొని వెళ్తాను అని ప్రధానోపాధ్యాయుని యొద్ద అనుమతి అడిగి ఆ విద్యార్థి భుజం పైన చెయ్యి వేసుకొని తీసుకొని వెళ్లారు. బాబు ఇతరులు చెప్పేది నువ్వు పట్టించు కోవద్దు. నువ్వు లోకంలో ప్రసిద్ధి గాంచిన వాడివి కాగలవు కాబట్టి బాగా చదువుకో అని చెప్పి ఆ విద్యార్థిని ఉత్సాహ పరిచారు. ఆ మాటలు విద్యుత్ వలె ఆ విద్యార్థి లోపలకు ప్రవేశించాయి. తను బాగా చదివి ప్రసిద్ధి గాంచిన వేద పండితుడు అయ్యాడు. అతడే జార్జ్ అడమ్స్ స్మిత్. ఆ ప్రముఖ వ్యక్తి యొక్క ఉత్సాహ కరమైన మాటలే కదా ఆ వ్యక్తిని వేద పండితుడిగా చేసాయి.
అపోస్తులుడైన పౌలు యొక్క ఉత్సాహ కరమైన మాటలు బలహీనమైన మరియు పిరికి స్వభావం కలిగిన తిమోతిని సంఘములను పర్యవేక్షించే అధికారిగా చేసాయి. నా ప్రార్ధనల యందు యెడతెగక నిన్ను జ్ఞాపకం చేసు కొనుచు నీయందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని దేవుని యెడల కృతజ్ఞతతో ఉన్నాను అని అంటున్నారు. ఆ విశ్వాసం మీ అవ్వలో, మీ అమ్మలో వసించెను. అందులో నిలకడగా వుండుము అని కూడా అంటున్నారు. తిమోతీలో ఉన్న దేవుని వరాలు, బోధించే వరం, నాయకత్వం, సువార్త ప్రకటించుటకు కలిగిన ఆశక్తి వంటి వాటి యందు అలక్ష్యము చేయకుము, దేవుని కృపా వరం ప్రజ్వలింప జేయుము. ప్రతి రోజు వాక్యమును ధ్యానించుము అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రకముగా ఉత్సాహ పరచి తిమోతీని బలమైన నాయకునిగా చేసాడు అపోస్తులుడైన పౌలు.
ఆవును ప్రియమైన వారలారా మనలను కూడా ఉత్తమమైన వారిగా అభివృద్ది చేసేవి ఏవి మనలో ఉన్న మచ్చలేని విశ్వాసం మన అమ్మ యొద్దనుండి లేదా అవ్వ యొద్దనుండి నేర్చుకొన్నది. లేదా శుద్ధ హృదయంతో నేర్చుకొన్నదే. మరి ఇప్పుడు మనలో ఉన్నదా? మన వరాలను ప్రజ్వలింప జేస్తున్నామా? రోజులో ఒక గంట అయిన సువార్త ప్రకటించుటకు ఏర్పరచుకొని యేసుని అందరికి తెలియజేద్దాం. మీరు విద్యావంతులైతే ట్యూషన్ ద్వారా చిన్న పిల్లలకు దేవుని గూర్చి తెలియ జేయవచ్చు. లేదా సువార్త పత్రికలు అందించి అనేక మందికి సువార్తను ప్రకటించ వచ్చు. ఈ విధంగా లేచి చేసి దేవుని కొరకు ప్రకాశించండి. ఆమెన్.
- సిస్టర్. ఏ. బ్యూలా.
ప్రార్థన అంశం:-
రివైవల్ యూత్ ఈవ్ నింగ్ అనే మీటింగ్లో ఏర్పరచకొన బడిన యవ్వనులు పాల్గొనులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250