Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Monday, 05-Dec-2022

దిన ధ్యానము(Telugu) 06.12.2022 (Christmas Special)

 

అంశం:- ఆతిధ్యం.

 

"ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి" - హెబ్రీయులకు 13:2

 

పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లు అన్ని గడపలతో ఉంటాయి. దాని ఉద్దేశం ఏమనగా బాటసారులు అలసిపోయినప్పుడు ఈ గడపలో కూర్చొని కొంచం సమయం విశ్రాంతి తీసుకొని వెళతారు అనేదే. పాత నిబంధన కాలంలో మన పూర్వీకులకు ఒక అలవాటుగా ఉండేది. ఈ అలవాటును ఆతిధ్యం అంటారు. ఆతిధ్యం అనగా ఇంటికి వచ్చిన వారిని సత్కరించటం. కాని సమీప కాలంలో ఆతిధ్యం అనేది మన బంధువులు మరియు సన్నిహితుల మధ్య మాత్రమే ఆచరించ బడుతుంది. అదికాండం 18:1-10 వచనాల్లో అబ్రహామును గూర్చి మనం చదువుతున్నాం. అబ్రహాము ఎండవేళ తన గుడారపు ద్వారము యొద్ద కూర్చున్నప్పుడు ముగ్గురు మనుష్యులను చూస్తారు. చూసిన వెంటనే ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి వారికి నమస్కరించి వారి ఆకలిని తీర్చుటకు వారికి ఆహారం సిద్ధం చేసి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి ఎదుటనే నిలబడి యుండుటను మనం చూస్తున్నాం. వారు దేవదూతలు అని ఎరుగని పరిస్థితుల్లో కూడా వారిని సత్కరించారు. వారి ద్వారా జరగబోయే సంగతులను గూర్చి యెహోవా అబ్రాహాముకు తెలియజేసారు. లూకా సువార్త 16:19-31 వచనాల్లో ఇంకొక సంఘటనను మనం చదువుతున్నాం. తన ఇంటి వాకిట పడియున్న లాజరును పట్టించుకోకుండా అతనికి ఒక్క పూట కూడా ఆహారం ఇవ్వని ధనవంతుని ఆత్మ పాతాలములో బాధపడుటను మనం చూస్తున్నాం. అవును విధవరాళ్ళను, దిక్కులేని పిల్లలను మనం ఆదరించాలి. సహాయం కొరకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వారిని చూసి చూడనట్లు వెళ్ళకూడదు. వారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. క్రీస్తు వలె దయగల వారు ఆయన నామంలో సత్క్రియలను చేస్తారు. పేదలకు సహాయం చెయ్యడం మరియు వారిని ప్రోత్సాహించడం అనేది ఒక మనుష్యుని ఎన్నడూ దిగజార్చరాదు. వారిని ఉన్నత శిఖరాలకు ఎక్కించుటకు దారి తీసే మెట్ల వలె అవుతుంది. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! ఈ క్రిస్మస్ దినాల్లో మనకు పరిచయం లేని వ్యక్తులైన వారు ఆకలి గొని యున్నారు అని ఏరిగినట్లయితే మన యొద్ద ఉన్న దానిని మనం పంచిపెడదాం. క్రీస్తుని ఎరుగని మీ పొరుగువారు, వీధిలో ఉన్న వారు మరియు ఆహారం కొరకు కష్టపడే వ్యక్తులను ఇంటికి ఆహ్వానించి క్రీస్తు ప్రేమను తెలిపి క్రీస్తు చెంతకు నడిపిద్దాం. 

- శ్రీమతి. జబఖని శేఖర్ గారు.

 

ప్రార్థన అంశం:-

మిషనరీల కొరకు ఇల్లు కట్టి ఇచ్చేటటువంటి షూనేమీయురాలు లేచేటట్లు ప్రార్దిద్ధాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler holiganbet holiganbet giriş holiganbet güncel giriş enbet enbet giriş enbet güncel giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş meritbet meritbet giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş perabet meritking meritking giriş meritking meritking giriş pulibet pulibet giriş jojobet jojobet giriş jojobet güncel giriş Superbetin superbetin giriş hızlıcasino hızlıcasino giriş holiganbet holiganbet giriş bahsegel perabet perabet giriş süperbetin superbetin süperbetin giriş Padişahbet superbetin giriş Padişahbet Giriş casibom casibom giriş deneme bonusu deneme bonusu veren siteler deneme bonusu deneme bonusu veren siteler meritking meritking giriş meritking güncel giriş casibom süperbetin superbetin süperbetin giriş superbetin giriş Egebet