By Village Missionary Movement
Wednesday, 07-Dec-2022దిన ధ్యానము(Telugu) 07.12.2022 (Christmas Special)
అంశం:- కార్యాలయంలో క్రిస్మస్.
"ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను" - లూకా 2:10
ఒక కార్యాలయం అనేది అన్ని విధాలా పనులను కలిగి ఉంటుంది. మరియు ఒక క్రైస్తవ కార్యకర్త ఏ పదవిలో ఉన్న క్రీస్తులో తన తోటి వారికి మార్గ నిర్దేశం చేయవలసిన బాధ్యత వుంది. అది మాటల ద్వారా మాత్రమే కాదు మన యొక్క క్రీస్తు మాదిరి జీవితం నడవడికలతో క్రీస్తుని పరిచయం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. మన యొక్క జీవితమే మన చుట్టూ వున్న వారికి అందాన్ని కలిగించే విధముగా మనం మారాలి. ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రేమను బయలు పరిచే విధముగా బహుమతులను, బైబిల్లు, వాక్యాలు ఇతరులకు ఇవ్వవచ్చు. అదేవిధంగా నూతన సంవత్సర వాగ్దానం కొరకు నూతన సంవత్సర వాక్యపు క్యాలండర్ ఇవ్వవచ్చు.
అన్య మత సంస్థలలో పనిచేసేవారు క్రిస్మస్ సువార్తను అంత బహిరంగంగా పంచుకోలేరు. కాబట్టి క్రిస్మస్ రోజు మనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారితో వాక్యమును, క్రీస్తు జన్మ ఉద్దేశ్యం పంచుకొనవచ్చు. అలాగే క్రిస్మస్ కార్యక్రమాలు జరిగించుటకు వారు వారి కార్యాలయాల్లో అనుమతించినప్పుడు పరిశుద్ధాత్ముని సహాయంతో , తోటి సేవకులతో కలిసి ఉపవాసం ఉండి తోటి ఆత్మల కొరకు భారంతో ప్రార్దించిన తరువాత సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తు అక్కడ నాటబడతారు. అలాగే క్రీస్తు జన్మ ఉద్దేశ్యం ప్రతిరోజు తోటి కార్మికుల గాయం కట్టుట ద్వారా నలిగిన వారిని విముక్తి పొందించుట ద్వారా ప్రభువు అనుగ్రహ సంవత్సరాన్ని ప్రసిద్ధి చేయుట ద్వారా నెరవేర్చాలి.
అవును సమర్పణ మరియు సాక్ష్యములతో దయ నొందిన జీవితమే మన కార్యాలయాల్లో నిజమైన క్రిస్మస్ శుభవర్తగా ఉండును ఆమెన్. రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై యున్నాము. హల్లేలూయా!
- శ్రీమతి. మెర్సీ ఆలేజానర్ గారు
ప్రార్థన అంశం:-
బ్రతిమలాడి మాట్లాడే ఎస్తేర్ మిషనరీ అనే ప్రార్థనా గుంపులో బ్రతిమలాడి మాట్లాడే ఎస్తేర్ లు లేచులాగున ప్రార్దిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250