Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.12.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 10-Dec-2022

దిన ధ్యానము(Telugu) 11.12.2022 (Kids Special)

 

అంశం:- ప్రేమతో అర్థవంతమైన క్రిస్మస్.

 

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” - యోహాను 3:16

 

హాలో పిల్లలు ఎలా ఉన్నారు? క్రిస్మస్ ప్రోగ్రాం ఎలా జరుగుతున్నాయి? హ్యాపీగా ఉన్నారా. ఒకే అయితే ఈరోజు పక్షులు మరియు జంతువులు అన్ని అర్థవంతమైన క్రిస్మస్ ను ఎలా జరుపుకోవాలో నేర్పించ బోతున్నాయి. సరే కథను విందామా!

 

అడవి రాజు అయిన సింహం అకస్మాత్తుగా ఒక మీటింగ్ పెట్టింది. దేవునికి భయపడే మంచిదైన రాజు చెప్పిన వెంటనే జంతువులు అన్ని లోబడి సమూహముగా ఒక చోట చేరాయి. అందులో ఉన్న ఏనుగు ఎందుకు ఈ మీటింగ్ అని అడిగింది. రెండు సంవత్సరాలుగా పక్షులకు మనకు ఉన్న గొడవ వలన క్రిస్మస్ సెలెబ్రేషన్ జరగనేలేదు. ఈ సంవత్సరం అయిన అందరం కలిసి కట్టుగా క్రిస్మస్ జరుపుకోవాలి అని మీ రాజు అనుకుంటున్నారు అని జింక చెప్పింది. వెంటనే కుందేలు, కోతి మిగిలిన అన్ని జంతువులు అవును అన్నాయి. సింహము వచ్చిన వెంటనే ప్రారంభ ప్రార్థన మరియు స్వాగతం అన్ని ముగిసిన తరువాత సింహం మాట్లాడటం మొదలు పెట్టింది. ఈరోజు నుండి అడవిలో గొడవలు, తగాదాలు రాకూడదు మరియు అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటూ ఉండాలి అని చెప్పింది. దానికి జంతువులు అన్నీ ఒకేసారి సరే అన్నాయి. 

 

ఆ సమయంలో ఎగిరి వెళ్తున్న కాకి మీటింగ్ జరుగుతుంది కాని మనలను పిలువలేదు అని పావురంతో చెప్పింది. సరే మన పక్షులు అన్నింటిని పిలుద్దాం అని చెప్పి పిలిచింది పావురం..రాజా మీటింగ్ ఉన్నది అని చెప్పలేదు ఎందుకు అని అడిగింది కాకి. మీరు వస్తేనే అంత అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పింది ఎలుగుబంటి. అందుకు మేము ఏం చేసాము అని పక్షులు అన్ని అరిచాయి. సింహం గద్దించగా అన్ని నిశ్శబ్దంగా అయిపోయాయి. క్రిస్మస్ అంటే తండ్రి అయిన దేవుడు మన పైన ఉంచిన ప్రేమ నిమిత్తముగా తన కుమారుడ్ని భూమి పైకి పంపించిన రోజు. కాని మనం ఇలా గొడవ పడుతూ కోపంతో, ద్వేషంతో క్రిస్మస్ జరువుకోవచ్చా? మనం అందరం ఐక్యంగా కలిసి ప్రేమగా అర్థవంతమైన క్రిస్మస్ ను జరుపుకోబోతున్నాం అని చెప్పిన రాజు యొక్క గర్జన వినగానే మిగిలిన పక్షులు, జంతువులు అన్నీ కూడా మేము అలానే చేస్తాం అని చెప్పాయి. 

 

చిన్న తమ్ముడు చెల్లి మీరు క్రిస్మస్ ను ఎలా జరుపుకోబోతున్నారు? ఎవరితో అయిన గొడవపడి వారితో మాట్లాడ కుండా వారిని క్షమించ కుండా వుంటున్నారా? వెంటనే సోరి అడిగి ప్రేమతో అర్థవంతమైన క్రిస్మస్ ను జరుపుకుని చూడండి. ప్రేమ గల దేవుడు మీ వేడుకల్లో సంతోషిస్తారు. ఒకే నా పిల్లలు. 

సరే ఇప్పుడు ఒక కంఠత వాక్యం కూడా నేర్చు కుందామా? 

- సరే పిల్లలు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet