Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.12.2022 (Christmas Special)
Share:

By Village Missionary Movement

Tuesday, 13-Dec-2022

దిన ధ్యానము(Telugu) 13.12.2022 (Christmas Special)

 

అంశం:- రోజు రోజు

 

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" - 2 కోరింథీయులకు 5:17

 

లండన్ నగరానికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ కు ముందు రోజు రాత్రి క్రీస్తు జననం గురించి నాటకం నటిస్తారు. ఆ గ్రామంలో ఉన్న వారు అందులో నటిస్తూ ఉంటారు. ఆ సంవత్సరం వాలెస్ అనే యువకుడు కొత్తగా నటించాలి అనే ఆశతో అక్కడ ఉన్న డైరెక్టర్ ని అనుమతి అడిగి గొర్రెల కాపరి వలె నటించాలి అనే ఆశను తెలియజేశాడు. కాని ఆ డైరెక్టర్ నీవు చాలా పొడవుగా ఉన్నావు ఎందుకు గొర్రెల కాపరిలా నటించాలి అనుకొంటున్నావు అని అడిగారు. అందుకు ఆ యవ్వనస్తుడు అయ్యా యేసయ్య ను మొదట చూసే భాగ్యం గొర్రెల కాపారులకే దొరికింది. అందుకే నాకు గొర్రెల కాపరి వలె నటించాలి అని ఆశ ఉంది అన్నాడు. వెంటనే ఆ డైరెక్టర్ నువ్వు సత్రాల నిర్వహకుడిగా నటించు అని చెప్పారు. అందుకు ఆ యవ్వనుడు సరే అన్నాడు. శిక్షణ పూర్తి అయ్యింది. నాటకం ప్రదర్శించ వలసి వచ్చింది. 

 

ఆ గ్రామ సంఘ బోధకుడు ప్రార్దించి నాటకమును ప్రారంభించమని చెప్పారు. వాలెస్ సత్రం ముందు నిలబడి పని మనుష్యులతో పనిని చేయిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఆ సమయంలో నెలలు నిండిన గర్భిణీల వలె ఏ సమయంలో అయిన ప్రసవించ వచ్చు అనే స్థితిలో మరియ మరియు యోసేపు చాలా దూరం నుండి అలసటతో వచ్చి విశ్రాంతి తీసుకొనుటకు స్థలం దొరుకుతుందా లేదా అని వెతుకుతూ ఆ సత్రం దగ్గరకు వచ్చారు. సత్రం నిర్వాహకుడు అయిన వాలెస్ దగ్గరకు వెళ్లి నా భార్య నెలలు నిండిన గర్భిణీ మీ సత్రంలో మాకు కొంచం స్థలం దొరుకుతుందా అని అడుగుతాడు. అందుకు ఆ సత్రం నిర్వాహకుడు మీకు స్థలం మీరు వెళ్ళవచ్చు అని కఠినంగా మాట్లాడుతాడు. యోసేపు మరియ బాధతో వెళ్లిపోతున్నప్పుడు వాలెస్ కు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో నేను ఇలా మాట్లాడేసాను అని వారిని కనికరించి వెంటనే వాలెస్ యోసేపును పిలిచి మీరు వెళ్ళవద్దు నా గదిలో విశ్రాంతి తీసుకొనండి ఈరోజు యేసుక్రీస్తు మా ఇంట్లో జన్మించనియ్యండి అని చెప్పాడు. దానిని చూసిన డైరెక్టర్ వాలెస్ నువ్వు నాటకమును నాశనం చేసేసావు అని అరిచారు. ఏదో విధంగా ఆ నాటకం పూర్తి చేసి తరువాత కార్యక్రమంలోనికి వెళ్లారు. 

 

చివరిగా ఆ గ్రామ పెద్ద లేచి ప్రతి సంవత్సరం మనం ఈ నాటకమును చూస్తున్నాం. ఈరోజు వాలెస్ మాట్లాడే మాటలు మనలను ఆలోచింపజేస్తున్నాయి. అవును యేసయ్య మా ఇంట్లో జన్మించనియని అని చెప్పే మాటలు ఎంత గొప్పది. ఈ రోజు మన హృదయంలో యేసయ్య పట్టుటకు మనము మనలను సమర్పించు కుందాం అని చెప్పారు. 

 

అవును ప్రియమైన వారలారా! సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ ను జరుపుకోవడం కాదు యేసు మనలో పుట్టి మన పాత పాపపు జీవితమును మార్చుటకు మనలను సమర్పించుకొన్న ప్రతి రోజు క్రిస్మస్సే. మన జీవితంలో యేసు పుట్టారు అని అంతులేని సంతోషం మనలో నిండనిద్దాం అదే అర్థవంతమైన క్రిస్మస్. 

- బ్రదర్. డి. ఆల్విన్ జాకబ్ గారు.

 

ప్రార్థన అంశం:-

రివైవల్ యూత్ ఈవినింగ్ అనే మీటింగ్ లో పాల్గొన్న యవ్వనులు ఈ అంత్యకాల ఉజ్జీవపు ఆయుధాలుగా దేవుని చేతిలో వాడబడులాగున ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet