Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.01.2023
Share:

By Village Missionary Movement

Friday, 20-Jan-2023

దిన ధ్యానము(Telugu) 20.01.2023

 

అంశం:- ఉజ్జీవమును ఆశించే వారి కూటం. 

 

"అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు" - అపో.కార్యములు 2:17

 

దేశంలో ఉజ్జీవం కలగాలని మీరు ఆశిస్తున్నారా? అలా అయితే ఈ వార్త మీ కొరకే నేను ఉజ్జీవమును ఆశిస్తే అది మొదట నాలో నుండి ప్రారంభించబడాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విధముగా రాండి రిక్యాప్స్ అనే సేవకుడు ప్రార్థించాడు. ఆయనలో ఉన్న ఉజ్జీవ అగ్ని తన భార్యలో కూడా కలిగింది. తరువాత తాను తన భార్యతో కలిసి తమ దేశపు ఉద్యమం కొరకు 12 వారాలు ఉపవాస ప్రార్థనలను నియమించి సంఘముగా కలిసి ప్రార్థిస్తూ వచ్చారు. ఇందులో సిటి టౌన్ స్టంట్ అనే సువార్తికుడు కుటుంబముగా పిలవబడ్డాడు. లెక్ వుడ్ అనే స్థలంలో నాలుగు హైవే రోడ్లపై గుడారం వేసి ప్రార్థిస్తూ వచ్చారు. ఈ ప్రార్థన గుడారంలో రాత్రి సమయం మాత్రమే 5000 మంది యవ్వనులు కలిసి ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నారు. 

 

పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి అని చదువుతున్నాం. అదేవిధంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని మనం చదువుతున్నాం. మనం చిన్న చిన్న గుంపులుగా కూడి ఐక్యమనస్సు కలిగి ప్రార్ధించినప్పుడు మనలను చూసిన వారిలో కూడా ఉజ్జీవపు అగ్ని రగులు కొనడం అనేది, అధిక నిశ్చయం. 

 

దేవుని గొప్ప కృప వలన గడిచిన నవంబర్ నెలలో 27 స్థలాలలో ఉజ్జీవమును ఆశించే వారి కూటమును జరిగించుటకు ప్రభువు సహాయం చేశారు. దాని మూలముగా వేల కొలది మంది ప్రజలను సంధించి ప్రార్థన గుంపుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగినది. మీరు మాతో కలిసి ప్రార్థించి దేశంలో ఉజ్జీవమును కలిగించుటకు భుజమును అందిస్తారా? పదిమంది ఉన్న ప్రార్థనా గుంపులో పది మందే ఉన్నట్లయితే పరలోకమునకు లాభం ఏమిటి? కొంచెం ఆలోచించి చూడండి. పదిమంది ఉన్న ప్రార్థన గుంపు పది గుంపులుగా మారి 100 మంది ఉన్న ప్రార్ధనా గుంపుగా మార్చబడాలి అదే ఉజ్జీవనకు గుర్తు. ఈరోజు నుండి మనం దీనిని ఒక లక్ష్యం వలె ఎంచుకొని ముందుకు సాగుదాం. 

 

గమనిక: దేశంలో ఉజ్జీవం ఎక్కడో కాదు అది మనలో నుండి కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొనండి. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో గల తిరుచిలో మే 1 వ తేదీన జరగబోయే ఒక లక్ష యవ్వనుల కూడిక కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş