Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.01.2023
Share:

By Village Missionary Movement

Friday, 20-Jan-2023

దిన ధ్యానము(Telugu) 21.01.2023

 

అంశం:- పిల్లల తరఫున పిల్లలను ఆదుకొనుట. 

 

"మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను" - ఫిలిప్పీయులకు 2:4

 

ఒంటరి వ్యక్తిగా ఉండి తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న మేరీ అనే తల్లి గారిని చూసి ఆ స్కూల్ టీచర్ ఒక చిన్న కంపెనీలో పని చేస్తూ కొంచెం జీతంతో ఎలా ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించగలుగుతున్నారు అని అడిగారు. అందుకు ఆ మేరీఅమ్మ నా భర్త సేవకులను మరియు సేవకుల పిల్లలను ఆదుకొనుటలో ఆసక్తి కలిగి ఉంటారు. ఎందుకు డబ్బులను వృధా చేస్తున్నారు అని అడుగుతాను కాని ఆయన నేను ఖర్చు చేస్తున్న డబ్బులు అన్నీ పరలోకంలో నిధి వలె సమకూర్చబడి ఉన్నవి అని చెప్తూ ఉంటారు. ఆయన మరణించిన తర్వాతే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నా జీతంతో కుటుంబాన్ని మాత్రమే నడిపించగలను. నా పిల్లల చదువులకు ఖర్చులకు నా దగ్గర సరిపడే డబ్బులు లేవు కాని దేవుడు ఉపాధ్యాయుని కన్నులలో దయను చూపించారు. ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్ల యొక్క చదువు ఖర్చులకు అయ్యే పూర్తి బాధ్యత వహించారు. ఇంకొక పిల్ల యొక్క చదువు ఖర్చులను ఆ స్కూలే బాధ్యత వహిస్తుంది. ఏ లోటు లేకుండా మా దేవుడు మమ్ములను నడిపిస్తున్నాడు అని చెప్పారు మేరీఅమ్మ. 

 

మనం ఇప్పుడు అందుకునే జీతం కంటే ఎక్కువ జీతం వస్తే కుటుంబమునకు చక్కగా ఉంటుంది అని అనుకోనవచ్చు. కాని అందులో కూడా మనం తృప్తి చెందలేదు అనేది నిజం. నాకు వచ్చే జీతం లో ఒక పిల్లను దత్తత తీసుకొని వారి విధ్యా ఖర్చులను నేను చూసుకుంటాను అని మనం ఎప్పుడైనా ప్రార్థించామా? ఇతరుల కార్యములు కూడా చూడవలెను అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. దీనిని గూర్చి మన ఆలోచన ఏమిటి? ఇతరులకు సహాయం చేయుటలో మీ వంతు ఏమిటి? 

 

ప్రియమైన వారలారా! మనం లేని వారికి సహాయం చేయడం అనేది అది దేవునికి చేయడం అవుతుంది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మీరు ఆధారం లేని పేద స్థితిలో ఉన్న ఒక చిన్నారిని దత్తత తీసుకుని చదివించినట్లయితే అది చూసిన మీ పిల్లలు కూడా ఆ మంచి కార్యాన్ని నేర్చుకుంటారు. ఇటువంటి మంచి పని చేయాలని ఆలోచన మన సంతతి వారికి, మన తర్వాత సంతతి వారికి కూడా కలుగుతుంది అనే దానిలో సందేహమే లేదు. ఈ విధముగా మేము గ్రామ మిషనరీ సంస్థ కుటుంబముగా తమ పిల్లల తరఫున ఇతర పిల్లల యొక్క బాధ్యత వహించే వారి వలె ప్రోత్సహిస్తూ వస్తున్నాం. దీని మూలంగా అనేక మంది చిన్న పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. ప్రాముఖ్యంగా అనేకమంది ఆదివాసి పిల్లలు ఇందులో ఉన్నారు వీరి కొరకు ప్రార్థించండి. 

 

గమనిక: మన కొరకు సమకూర్చుకున్న సొత్తు ఒకరోజు నశించిపోతుంది. ఇతరులకు సహాయం చేసి అందులో మనం పొందుకున్న సంతోషం అనే సొత్తు నశించనిది అనే విషయాన్ని జ్ఞాపకము ఉంచుకొనండి. హల్లెలూయ! 

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం:

యెహోషువా లేము అనే మీటింగ్లో పాల్గొన్న పిల్లలు అంత్యకాల ఆయుధముల వలె మారులాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş