Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.01.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 22-Jan-2023

దిన ధ్యానము(Telugu) 22.01.2023 (Kids Special)

 

అంశం:- కాంతినివ్వండి.

 

కంటత వాక్యం:

 

"మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి" - మత్తయి సువార్త 5:16

 

హలో తమ్ముడు చెల్లి అందరూ జాలీగా ఉన్నారా? పిల్లలు మీరు వెలుతురుగా ఉన్నప్పుడు భయపడతారా? లేక చీకటిగా ఉన్నప్పుడు భయపడతారా? ఓకే సరిగ్గా చెప్పారు చీకటిగా ఉంటేనే అందరూ భయపడతారు. ఇలా చీకటిని చూసి భయపడే మనలను చూసి మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు అని యేసయ్య చెప్పారు. మేము ఎలా వెలుగుగా ఉండగలం అని అనుకుంటున్నారా? ఈరోజు కథని విని తెలుసుకుందాం రండి. 

 

ఒక రాజుకు ముగ్గురు మగ బిడ్డలు ఉండేవారు. ఆ రాజు బాగా వృద్ధుడు అవడంతో తన కుమారుల్లో ఒకరిని రాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఆ ముగ్గురులో ఎవరు తెలివైన వారిగా ఉన్నారో వారిని రాజుగా చేయాలి అనుకుని ఆ ముగ్గురిని పిలిచి వారికి ఆ రాజ భవనంలో వేరువేరుగా ఖాళీ గదులను మరియు కొంచెం డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో మీరు వేటినైనా కొని ఈ గదులను నింపాలి ఇందుకు ఒక వారం రోజులు సమయాన్ని తీసుకొనండి అన్నారు రాజు. ఒక వారం అయింది రాజు తన పిల్లల గదులను చూసి వద్దాం అనుకొని తన ప్రధానులను పిలిచి తన పెద్ద కుమారుని గదికి వెళ్లి తలుపు తెరిచి చూస్తే చీకటిగా ఉండి ఇటు అటు ఎలుకలు తిరుగుతున్నాయి. ఆ గది అంతా గడ్డితో నింపాడు పెద్ద కుమారుడు. రెండవ కుమారుని గదికి వెళ్లి తలుపు తెరిచాడు రాజు. అక్కడ కూడా చీకటిగా ఉంది ఆ గది అంతా దూది మాటలతో నింపాడు తన రెండవ కుమారుడు. పెద్దవారు ఇలా ఉన్నారు ఒక రాజభవనంలో ఏం పెట్టాలో కూడా తెలియదు అనుకొని తన చిన్న కుమారుడు దేనితో తన గదినింపాడు చూద్దామని తన గది తలుపు తెరిచి చూశారు రాజు. తెరిచిన వారికి చాలా ఆశ్చర్యం మరియు సంతోషం కలిగింది. తెరిచిన వెంటనే వెలుతురు వారి ముఖంపై పడింది లోపలికి వెళ్లి చూస్తే ఆ గది అంతా వెలుతురుతో నిండి ఉంది. ఆ కొంచెం డబ్బులతో ఒక మంచి దీపం కొని గదిలో పెట్టాడు. ఆ గది అంతా వెలుతురుతో నింపాడు రాజుకు చెప్పలేని సంతోషం. చిన్న కుమారునికి రాజు అగుటకు అర్హత ఉంది అని చెప్పి తన చిన్న , కుమారుని రాజుగా అభిషేకం చేశారు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మనము కూడా పాపములోనే ఉన్నట్లయితే మన హృదయము కూడా ఇలానే చీకటిగా ఉంటుంది. పాపములు విడిచి బయటకు వస్తేనే మన హృదయం కాంతివంతంగా ఉంటుంది. కాంతివంతంగా ఉంటేనే యేసయ్య మన హృదయంలో నివాసం ఉండగలరు. అది మాత్రమే కాదు ఇతరులకు మేలు చేసి చీకటి కమ్మి ఉన్న మన దేశమునకు మనమే కాంతినివ్వాలి అప్పుడే యేసయ్య వచ్చినప్పుడు మనకు వాడబారని కిరీటము ఇస్తారు. 

- శ్రీమతి: సారాల్ సుభాష్ గారు. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş