Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.01.2023
Share:

By Village Missionary Movement

Monday, 23-Jan-2023

దిన ధ్యానము(Telugu) 24.01.2023

 

అంశం:- సువార్తను ప్రకటిద్దాం

 

"వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము" - 2 తిమోతికి 4:2 

 

ఒక అమ్మ ప్రతిరోజు ఎవరికైనా ఒకరికి సువార్త ప్రకటించాలి అని ఆశతో ఉండేవారు. ఆమె ఒకసారి మలేషియాలో ఉన్న తన కుమార్తెను చూడడానికి వెళ్లారు. విమానంలో అందరూ వారి వారి సీట్లలో కూర్చుని ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడుటకు అవకాశం లేదు. అప్పుడు విమాన సహాయకురాలు వచ్చి అ అమ్మకు శీతల పానీయం ఇచ్చారు. వెంటనే మీకు యేసయ్య ఎవరో తెలుసా అని అడిగింది అమ్మ. ఆ సహాయకురాలు ఏమీ మాట్లాడకుండా త్వరగా వెళ్ళిపోయారు. విమానంలో ప్రయాణిస్తున్న వారి పేర్లను విశ్లేషించి ఆ అమ్మ దగ్గరకు వచ్చారు. అమ్మ యేసు అనే పేరుతో ఎవరు ఈ విమానంలో ప్రయాణం చేయలేదు అని బాధపడుతూ చెప్పారు. ఆ అమ్మగారికి ఒకవైపు నవ్వు వచ్చినప్పటికీ ఇంకొక వైపు చాలా బాధనిపించింది. తరువాత ఆ విమాన సహాయకురాలికి యేసయ్యను గూర్చి చెప్పి ఒక సువార్త పత్రికను ఆమెకు ఇచ్చారు. 

 

మనము కూడా మన చుట్టూ ఉన్నవారికి యేసుక్రీస్తు గురించి తెలుసు అని అనుకుంటున్నాం. కాని అది నిజం కాదు కొన్ని సినిమాలలో చూసిన విధముగా యేసుక్రీస్తు ఫోటో ముందు కొవ్వొత్తులు వెలిగించి గురువు వద్ద పాప క్షమాపణ అడుగుటయే క్రైస్తవ్యం అని అనుకుంటున్నారు. ఒకసారి తమిళనాడులో గల విరుదునగర్ అనే జిల్లాలో ఒక గ్రామమునకు వెళ్లి అక్కడ ఉన్న ఒక అవ్వతో యేసుప్రభు చాలా మంచివారు మీకు మంచి చేస్తారు అని ఆమెతో చెప్పినప్పుడు ఆయనకు ఓటు వేయమని చెబుతున్నారా అని అడిగారు అవ్వ. ఆ మాటలు విని బిత్తర పోయాము. 

 

అవును రోమా 10:14 లో చెప్పబడిన విధముగా యేసు క్రీస్తును గూర్చి వినని వారు ఎట్లు విశ్వసించుదురు? ప్రసంగించే వాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రభువు మా గ్రామ మిషనరీ సంస్థకు ఇచ్చిన ఫిలిప్పు సువార్త గుంపు పరిచర్య అనే ప్రణాళిక నిమిత్తము ప్రతి శనివారం సేవా స్థలాలలో సేవ చేయాలని ఆశ కలిగిన వారిని ఒకటిగా చేర్చి గ్రామాలకు వెళ్తున్నాం. సువార్త పత్రికలు ఇవ్వడం వీధులలో వాక్యము చెప్పడం చిన్నపిల్లల మధ్య పరిచర్య చేయడం వంటివి ప్రతి గ్రామంలో చేస్తున్నాం. మీరు కూడా మీరు ఉన్న స్థలాల్లో మీ స్నేహితులతో కలిసి సువార్త అందని ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళండి. ఒక్కసారైనా వారికి సువార్తను వినిపించండి. దేవుని రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి కలిసి సేవ చేద్దాం. హల్లెలూయ!

- శ్రీమతి. జయ కుమారి. 

 

ప్రార్థన అంశం:

మనము ముద్రిస్తున్న మోక్ష ప్రయాణం మరియు ఇతర తమిళ పత్రికల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet vaycasino giriş vaycasino marsbahis giriş marsbahis holiganbet setrabet marsbahis giriş vaycasino giriş