Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.01.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 25-Jan-2023

దిన ధ్యానము(Telugu) 26.01.2023

 

అంశం:- నా భారతదేశం

 

"యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి" - రోమీయులకు 13:7 

 

భారతదేశ పౌరులమైన మనందరికీ పరిశుద్ధ గ్రంథము కొన్ని విషయాలను ప్రాథమిక బాధ్యత అని బోధిస్తుంది వీటిని చక్కగా చేసినప్పుడు మన దేశం ఆశీర్వదించబడుతుంది అంతేకాదు మనము కూడా ఆశీర్వదించబడతాము, ఆ బాధ్యతలు ఏమిటో చూద్దామా

 

1. పన్ను చెల్లించుట (మత్తయి 17: 24-27) మనదేశంలో సమస్యలకు పెద్ద సమస్య నల్లధనం. దీనిని నిర్మూలించాలి అని ప్రభుత్వం పకడ్బందీ చర్యలను తీసుకున్నప్పటికీ పన్ను సరిగా చెల్లించకుండా దొంగ లెక్కలు చూపిస్తూ సంపాదిస్తున్న ఈ నల్లధనం వలన మన దేశం ముందుకు సాగలేక పోతుంది. క్రైస్తవులమైన మనం పన్నును సరిగ్గా చెల్లించినప్పుడు దేశం ఆశీర్వదించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు తనకు మరియు తన శిష్యునికి పన్ను చెల్లించుట మనం ఎరిగియున్నాం. 

 

2. అధికారంలో ఉన్న వారిని సన్మానించుట (1 పేతురు 2: 17) ప్రభుత్వ అధికారులు అందరూ దేవుని ద్వారా ఏర్పరచుకొనబడినవారు అనియు వారిని సన్మానించాలి అనియు పరిశుద్ధ గ్రంధం మనకు బోధిస్తుంది. నేను దేవుని బిడ్డను దేవున్ని తప్ప మరి దేనిని సన్మానించను గౌరవించను అని చెప్పడం బుద్ధిహీనత. ఒక అధికారి మంచి గుణం కలిగి ఉండక లంచం తీసుకునే వారి వలె ఉన్నా సరే అతనిని మనం గౌరవించాలి. బహిరంగంగా కనిపించే పాపములను కాదు హృదయములో నుండి దానిని చేయాలి. అదే సమయంలో మనము సువార్త ప్రకటించుటకు అధికారులు, చట్టాలు మనలను ఆటంకపరిచినప్పుడు వాటికి లోబడవలసిన అవసరము లేదు. మతమార్పిడి చట్టాలు మనలను ఆటంకపరచకూడదు. ఒకసారి సువార్త ప్రకటించకూడదు అని ప్రధాన యాజకుడు పేతురును గద్దించి భయపెట్టాడు అందుకు పేతురు మనుషులకు కాదు దేవునికే మేము భయపడాలి అని చెప్పాడు. 

 

3. దేశం కొరకు ప్రార్థించుట (1తిమోతి 2: 1-2) అందరి కొరకు దేవుని స్తుతించి ప్రార్థించుట మన బాధ్యత. మనం రైలులో ప్రయాణించినప్పుడు ఆ శాఖ అధికారుల కొరకు అక్కడ పనిచేసే వారి కొరకు మనము దేవుని స్తుతిద్దాం. దేశ సరిహద్దుల్లో ఉండి మనలను సంరక్షిస్తున్న ఆర్మీ సైనికుల కొరకు ప్రార్థిద్దాం. ఒక ఉన్నతమైన కట్టడమునకు పునాది ఎంత ప్రాముఖ్యమో అలాగే క్రైస్తవులమైన మనము మన ప్రార్థన మన భారతదేశమునకు ప్రాముఖ్యం. దేవునికి లోబడేవారు ఎవరో వారు ప్రభుత్వమునకు కూడా లోబడి ఉన్నత పౌరులుగా జీవిస్తారు. నేటి భారతదేశ పౌరుల దినోత్సవ శుభాకాంక్షలు. 

- బ్రదర్. జే. సంతోష్ గారు. 

 

ప్రార్థన అంశం: 

ఫిలిప్పు సువార్త గుంపు ద్వారా సంధింపబడుతున్న నూతన గ్రామముల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet