Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.01.2023
Share:

By Village Missionary Movement

Monday, 30-Jan-2023

దిన ధ్యానము(Telugu) 31.01.2023

 

అంశం:- కరపత్రిక పరిచర్య

 

"అందుకు నతనయేలునజ రేతులో నుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను" - యోహాను 1:46

 

75 సంవత్సరాలు గల జాన్ అనే వృద్ధుడు విశ్రాంతి దినమున సంఘమునకు వెళ్లి ఆరాధన ముగించుకుని తన ఇంటికి వెళుతూ ఉన్నారు. మార్గoమధ్యలో ఒక ఆయన యేసు మంచివాడు అనే కరపత్రికలను అక్కడ ఉన్న కొందరికి పంచి పెడుతూ ఉన్నాడు. దానిని చూచిన అ వృద్ధుడు అతని వద్దకు వెళ్లి కరపత్రికలు తీసుకొని వీటిని ఇచ్చి నీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు. దీనివలన ఏ ఆత్మ కూడా ప్రభువు చెంతకు రాదు. పాపము నుండి విమోచన అనే అంశము గల కరపత్రికలను 30 సంవత్సరాలకు మునుపు నేను కూడా చుట్టుపక్కల గల గ్రామాలలో మరియు నగరాల్లో ఉన్నవారికి పంచి పెట్టాను. చాలామంది ఆ కరపత్రికలను తీసుకున్నారు గాని వాటిని ఎవరూ కూడా చదవలేదు కొందరు వాటిని చించి క్రింద పడేసారు. కాబట్టి ఇందువలన ఎలాంటి ప్రయోజనము లేదు అని తలంచి ఈ పరిచర్యను ఆపివేసేసాను అని అన్నాడు. అందుకు ఆ వ్యక్తి అయ్యా 30 సంవత్సరాలకు మునుపు నేను యవ్వనడిగా ఉండేటప్పుడు పాపమునకు బానిసగా ఉన్నాను. మీరు ఇచ్చిన కరపత్రికలను నేను అందుకొని చదివి యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించి రక్షణ పొందుకొని ఆ దినము మొదలుకొని ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నాను అని అన్నాడు. చివరిగా చూస్తే ఆ వృద్ధుడే 30 సంవత్సరాలకు మునుపు ఈ పరిచర్య చేస్తున్న వ్యక్తికి కరపత్రికను అందజేసినవాడు అని తెలియ వచ్చింది. 

 

ఈ దినము లేఖన భాగంలో కూడా ఫిలిప్పు కొన్ని మాటలు చెప్పి నతనయేలు అనే వ్యక్తిని ప్రభువు వద్దకు తీసుకుని వస్తున్నారు. ఆయన చేసిన చిన్న ప్రయత్నం వచ్చి చూడుము అనే మాటను నతనయేలును రక్షణ వైపునకు నడిపించింది. అలాగే మనం చేసిన పరిచర్యలో మనము చేస్తున్న చిన్న ప్రయత్నం కూడా మన ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేయగలదు. 

 

ప్రియమైన వారలారా! మన కరపత్రిక పరిచర్య కూడా ఇంతే. ప్రతిఫలాన్ని వెంటనే చూపించు అయినప్పటికీ వాటన్నింటినీ ఆయన మరువకుండా తమ లెక్కల్లో పెట్టుకుని ఉన్నారు. తగిన కాలం వచ్చినప్పుడు ఆయన తన ఫలాన్ని మనకు కనపరుస్తారు. ఒకవేళ భూమిపైన మన సొంత కంటితో చూడలేనప్పటికీ పరలోకంలో మనం చూసేటట్లు చేస్తారు. ప్రజలకు మనం కరపత్రికలను అందజేసినప్పుడు కొందరు మనలను అశ్రద్ధ చేయవచ్చు కొందరు వాటిని చించి పడేయవచ్చు. వీటి కొరకు మీరు నిరుత్సాహపడిపోకుండా సోలిపోకుండా ప్రార్థించి ఈ పరిచర్యను చేయవచ్చు దీనికి గల ఫలితాన్ని ఖచ్చితముగా చూస్తాం. 

 

గమనిక: రోజు 100 కరపత్రికలు ఇచ్చిన ఎడల దాంట్లో ఎందరు రక్షింపబడతారు అన్నది మీ ప్రార్థనలోనే ఆధారపడి ఉన్నది అనేదాన్ని గుర్తించుకొనుడి. 

- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్

 

ప్రార్థన అంశం:

మన సేవకుల యొక్క ప్రయాణ సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş