Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.02.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 31-Jan-2023

దిన ధ్యానము(Telugu) 01.02.2023

 

అంశం:- కృతజ్ఞత కలిగి ఉండుడి

 

"క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి" - కొలస్సీయులకు 3:15

 

దేవుడు అనేక మేళ్లను మన జీవితంలో చేస్తూ వస్తున్నారు. మనము భుజించుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును ఉండుటకు నివాస స్థలమును వీటన్నిటిని మనకు దయచేసి ఉన్నారు. మన శరీరాన్ని ఎంత ఆశ్చర్యకరంగా చేసి ఉన్నారో చూడండి. మనము భుజించుటకు అనేక రకములైన పంటలను పండ్లను కూరగాయలను సృష్టించి వాటన్నింటినీ మనము భుజించి బలము పొందుకునేటట్లు వాటిని మనకు దయచేసి ఉన్నారు. మనము ఆహారము భుజించేటప్పుడు వీటన్నింటినీ దయచేసిన ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి.

 

బైబిల్లో కూడా కీర్తనకాడైన దావీదు నేను అంతరంగంలో సృష్టించబడినప్పుడు నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండముగా ఉండగానే నన్ను మీరు ఎరిగి ఉన్నారు. నా అవయవములు రూపింప బడక మునుపే మీరు చూసి ఉన్నారు అని లేఖనములలో చెబుతున్నారు. అవును మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే మనలను ఎరిగి అవసరమైన అన్నింటిని సృష్టించి యున్నారు. ఆయన ఎంత ఆశ్చర్యమైన సృష్టికర్త కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాం అని కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంధంలో కూడా పదిమంది కుష్టు రోగులలో ఒక్కడు మాత్రమే పొందుకున్న మేలు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తిరిగి వచ్చాడు. స్వస్థత పొందిన వారు 10 మంది కదా! మరి మిగిలిన 9 మంది ఎక్కడ అని ప్రభువు వారిని అడిగి ఉన్నారు. కాబట్టి మనము కూడా కృతజ్ఞతా పూర్వకంగా ఉండుట నేర్చుకుందాం. 

 

ప్రియమైన వారలారా! మనము నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు ఆయన మనకు చూపించే కృపను తలంచుచు దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. అలా చేసినప్పుడు మనము ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేం. లెక్కించి చూడుము నీవు పొందుకున్న మేలులను అప్పుడు ఆయన చేసిన మేలులను తలచుకుని కన్నీటితో ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. కృతజ్ఞత అనే భావము మన పిల్లలకు శ్రద్ధగా బోధించి వాళ్లు కూడా దేవుని యెడల కృతజ్ఞత కలిగిన వారిగా ఎదిగే వారిగా ప్రోత్సహిద్దాం. మనుషులు మీకు చేసిన మేలుకు వాళ్లకు కృతజ్ఞతలు మరియు వారు మీకు చేసిన కీడునకు దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించండి. కృతజ్ఞత అనే పదము సంపూర్ణముగా చెప్పుట నేర్చుకుందాం. కృతజ్ఞతతో నిండిన హృదయం ఎప్పుడూ దేవున్ని ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుంది. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధనబాలన్ గారు. 

 

ప్రార్థన అంశం:

ఈ నెల అంతా జరుగుతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడైయుండి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort