Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.02.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 01-Feb-2023

దిన ధ్యానము(Telugu) 02.02.2023

 

అంశం:- నిశ్చయముగా నెరవేరును

 

"ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును" - హబక్కూకు 2:3

 

మతిస్థిమితం లేని పరిస్థితుల్లో వైద్యుల చేత విడనాడబడిన భర్త, అరణ్యములో నిలబడిపోయినట్లు ఒంటరితనం, అనేక ప్రశ్నలను మోసుకొని చలించిపోయిన మనసుతో నిలబడి ఉంది ఆమె. కొత్త సంవత్సరం అయినా 2016 ను నిరుత్సాహముతో ఎదుర్కొన్న ఆమెకు దేవుడిచ్చిన వాగ్దానం నీ దేవుడైన యెహోవాను నేను నీ కుడి హస్తమును పట్టుకుని ఉన్నాను కాబట్టి భయపడకుము నేను నీకు తోడై యుందును యెషయా 41:13 అనునదే. ఆమె దేవుడు నాకు తోడుగా ఉండి కార్యాలను మారుస్తారు భర్తకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు అని అనుకున్నది కానీ ఆ ఫిబ్రవరి నెలలోనే భర్తను కోల్పోయింది ఆమె. జీవితమే చీకటిమయం అయినట్టు మారింది. 

 

వాగ్దానమునకు నేను అర్హత కలిగిన దానను కాను దేవుడు నాకు దానిని ఇవ్వలేదు అని తలంచి ఆ వాగ్దానం విడిచిపెట్టి వాగ్దానము చేసిన దేవుని మాత్రం ప్రభువా నన్ను మరువకము అని గట్టిగా పట్టుకొని ఉన్నది. భర్త మరణముతో సమస్తము అయిపోయింది అని తలచింది అది ఆమెకు మాత్రమే కాదు ఆమె ఇంటి వారు కూడా అలానే అనుకున్నారు. తోడుగా నిలబడతాను అని వాగ్దానం చేసిన ప్రభువు మాత్రము ఆమెను విడవకుండా చీకటి పరిస్థితులలో కూడా తోడుగా ఉండి ముందుకు నడిపించారు. సి.ఎస్. ఐ అనే సంస్థలో వికలాంగుల కొరకు నడిపిస్తున్న స్కూల్లో స్పెషల్ బీఈడీ చదవకపోయినాను మూడు సంవత్సరాలు అక్కడ పని చేయడానికి దేవుడు సహాయం చేశారు..వికలాంగుల కొరకు నడిపిస్తున్న స్కూల్లో తాత్కాలికంగా పనిచేసినప్పటికీ ఆ రాబడి ద్వారా నా అవసరతల కొరకు ఎవరికీ చెప్పకుండా నా అవసరతలు నేను తీర్చుకొనుటకు దేవుడు నాకు సహాయం చేశారు. కుటుంబంలో నిస్సహాయమైన పరిస్థితి వచ్చినప్పుడు మరలా ఒంటరితనాన్ని చవిచూసింది ఆమె. ఈ పరిస్థితుల్లో నన్ను నా కుమార్తెను పోషిస్తాను అని అంగీకరించి ఒప్పుకున్నారు ఒక మిషనరీ. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాము. ఆ స్త్రీ వేరే ఎవరో కాదు నేనే. 

 

ప్రియమైన వారలారా! గడిచిపోయిన కార్యాలను నేను తిరిగి చూసినప్పుడు నేను ఒకటి అర్థం చేసుకున్నాను. నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోకుండా దేవుడే నాకు వాగ్దానం నుంచి నడిపించారు. అవును వాగ్దానం చేసిన వారు నమ్మదగినవాడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నెరవేర్చుటకు సమర్ధుడు. మన పరిస్థితులు మనం చూసినప్పుడు ఇది నెరవేరదు అన్నట్లు జీవితం కనబడినను దేవుడు దానిని మార్చగల సమర్థుడు. దేవుడు తాను చెప్పిన మాటను మనలో నెరవేర్చుటకు ఆయన ఎలాంటి మార్గంలోనైనా మనల్ని నడిపించగలడు. అదేవిధంగా ఆయన మనకు తోడుగా నడుస్తూ వస్తారు కూడా. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిరుత్సాహ పడిపోకండి, అలసిపోకండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కచ్చితంగా నెరవేర్చి ముగించే వరకు మీతోనే నడుస్తారు. ఆమెన్ .

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

వి.ఎం.ఎం ద్వారా కట్టడానికి సిద్ధము చేయబడుతున్న స్కూల్ త్వరగా కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort