Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.02.2023
Share:

By Village Missionary Movement

Friday, 03-Feb-2023

దిన ధ్యానము(Telugu) 03.02.2023

 

అంశం:- ట్రై జీసస్

 

"యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు" - కీర్తనలు 34:8

 

పెద్ద సంఖ్యలో అనేక మంది సైంటిస్టులు కలిసి ఎగ్జిబిషన్ ఒకటి జరిపిస్తున్నారు. అక్కడ వారు కనుగొన్న అనేక వస్తువులను ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక సైంటిస్ట్ దేవుడు లేడు అనే సిద్ధాంతము కలవారు. ఆయన హఠాత్తుగా లేచి నిలబడి ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా దేవుడు ఉన్నారు అని నిరూపించగలరా అని గట్టిగా చెప్పి హేళన చేసి నవ్వారు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. హఠాత్తుగా ఒక చిన్న బాలుడు చేతిలో ఆపిల్ పండును పట్టుకుని వేదిక పైకి వచ్చాడు. దేవుడు ఉన్నారు అని నేను నిరూపిస్తాను అని చెప్పి ఆపిల్ పండును తినడం ప్రారంభించాడు. దానిని చూచిన సైంటిస్ట్ కు మహా కోపం వచ్చింది. ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగారు. అందుకు ఆ బాలుడు ఇప్పుడు నేను తిన్న యాపిల్ చేదా, తీపా లేక పులుపుగా ఉందా అని అడిగాడు. నీవు తింటున్న ఆపిల్ ఏ రుచిలో ఉంటుందో నాకు ఎలా తెలుసు అని అన్నారు ఆ సైంటిస్ట్. అప్పుడు ఆ బాలుడు నేను ఎలా ఈ పండుని రుచి చూశానో అలాగే నేను కూడా దేవుని రుచి చూసి ఉన్నారని తెలుసుకున్నాను అని చెప్పి మీరు కూడా రుచి చూడండి అని అన్నాడు. ఆ సైంటిస్ట్ కు మారు మాట చెప్పే ఆలోచన లేకపోయింది. తరువాత తన తప్పిదమును అంగీకరించి తలను దించుకున్నారు. 

 

బైబిల్ లో కూడా ఈయన నా హృదయానుసారమైన వ్యక్తి అని దావీదు గురించి దేవుడు చెప్పారు. ఆ దావీదు అయితే యెహోవా ఉత్తముడు అని అనేక కీర్తనలలో రాసి పెట్టాడు. బైబిల్లో మాటలు చెప్పినంత మాత్రాన ఆయన మంచివాడుగా ఉండిపోలేదు. మన జీవితంలోనూ మన ప్రతి కదలికలోనూ ఆయన మంచివాడు గానే ఉన్నారు. అరణ్యంలో సనుగుకున్న ఇశ్రాయేలు జనాంగమునకు ఆయన మంచివాడి గానే ఉన్నారు. అరణ్యంలో తిరుగులాడిన హాగర్ జీవితంలో ప్రభువు మంచి వాడిగానే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మూడున్నర సంవత్సరాలు మాత్రమే కాదు 33½ సంవత్సరాలు కూడా మంచివాడిగాను మేలు చేసేవారిగాను జీవించారు. 

 

ప్రియమైన వారలారా! ఆయన మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు నా కొరకును దీనిని చదువుతున్న మీ కొరకును మన తప్పిదముల కొరకు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టినవారు. మన పాపముల కొరకు ఏ పాపము ఎరుగని ఆయన బలి అయ్యారు. మూడవ దినమున తిరిగి లేచారు. మరల మన కొరకు తిరిగి రాబోతున్నారు. మరి మీరు ఎందుకు యేసు క్రీస్తు ప్రభువును రుచి చూడకూడదు. ట్రై జీసస్ టుడే! 

- బ్రదర్. ఆల్విన్ జాకబ్ గారు. 

 

ప్రార్థన అంశం:

స్కూల్ మిషన్ పరిచర్య ద్వారా దర్శించబడుతున్న విద్యార్థులు దేవునిలో ఎదిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet setrabet betnano casibom casibom jojobet jojobet giriş marsbahis casibom güncel giriş casibom casibom giriş casibom