Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.02.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 21-Feb-2023

దిన ధ్యానము(Telugu) 21.02.2023

 

అంశం: బంగారు దేవతలు

 

"నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" - నిర్గమకాండము 20:3

 

దేవుడు ఐగుప్తీయులను తెగుళ్లతో బాధించినప్పుడు వారు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులకు ఇవ్వవలసిన 400 సంవత్సరాల జీతం ఇచ్చి వారిని బయటకు పంపించాలి అని యెహోవా దేవుడు కోరుకున్నాడు. మోషే చెప్పిన విధముగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల నుండి వెండి మరియు బంగారు వస్తువులను అలానే వస్త్రాలను అడిగి తీసుకుని వారిని దోచుకున్నారు. కానీ అతి త్వరలోనే తమ వద్ద ఉన్న బంగారముతో ఒక దూడను తయారు చేసి దానిని పూజించి విగ్రహారాధికులు అయ్యారు.

 

క్రైస్తవులమైన మనము మన ఆస్తులను వినియోగించడంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఈ సంఘటన మనకు హెచ్చరిస్తుంది. దేవుని పిల్లలు బంగారము, వెండి, డబ్బు వంటి వాటిని అనుభవించవచ్చు కానీ వాటిని జ్ఞానము లేకుండా ఇష్టానుసారముగా ఉపయోగించడం కూడా పాపమే. అవి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులలో పాపము గా మారుతాయి? 1. మనకు ఉన్నదాన్ని బట్టి మనం గర్వించినప్పుడు. 2. మనం పూర్తిగా దేవునిపైన ఆనుకోవడం వదిలి మన ఆభరణాల పైన మన ఆస్తులు పైన బ్యాంకు ఖాతాల పైన నమ్మకం ఉంచినప్పుడు. మనం ఈ లోకంలో పరదేశులమై ఉన్నాము కాబట్టి ఐగుప్తీయుల యొక్క ఆస్తులు పైన మనసుపెట్టి పరలోక పిలుపును మరిచిపోకూడదు.

 

ప్రియమైన వారలారా! మనము ఈ లోకపు ఆస్తులను దేవుని కొరకు ఉపయోగిస్తున్నామా లేదా వాటికి బానిసలైపోయామా ఆలోచిద్దాం. కుమారుడా, కుమార్తె మీ పిలుపు ఉన్నతమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు మృదువైన స్వరముతో మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకపు ఆస్తులు మనకు మంచి సహాయకరంగా ఉన్నప్పటికీ అవి మనలను క్రూరమైన యజమానులుగా చేసి మనలను బానిసలుగా చేయుటకు ఎన్నటికీనీ చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉందాం.

- శ్రీమతి. గీతా రీఛర్డ్ గారు

 

ప్రార్థన అంశం:

మన సేవా స్థలాల్లో ప్రతిరోజు ఉదయం 100 సువార్త పత్రికలు ఇస్తూ వస్తున్నారు ఆ పత్రికలో పొందుకున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino