By Village Missionary Movement
Wednesday, 22-Feb-2023దిన ధ్యానము(Telugu) 22.02.2023
అంశం: బాప్తిస్మము వద్దు
"దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే" - 1పేతురు 3:21
ఈరోజు మనము బాప్తీసము తీసుకొనుటకు ఏవేవి కారణంగా ఉండకూడదు అనే విషయాన్ని ధ్యానిద్దాం.
1. ఒక క్రైస్తవ స్త్రీని లేదా పురుషుని వివాహము చేసుకొనుట కొరకు ఎవరును బాప్తిస్మము తీసుకొనకూడదు.
2. తన యొక్క బోధకులను లేదా తల్లిదండ్రులను లేదా స్నేహితులను సంతోషపరచుట కొరకు ఎవరును బాప్తిస్మము తీసుకొనకూడదు.
3. కుటుంబంలో ఇతరులు బాప్తిస్మము తీసుకుంటున్నారు అని చెప్పి నేను కూడా తీసుకుంటాను అని ఏ ఒక్కరు బాప్తీసము తీసుకొనకూడదు.
4. బాప్తిస్మము అనేది పరలోకమునకు తీసుకొని వెళ్లే టికెట్ అనుకొని ఎవరును బాప్తిస్మము తీసుకొనకూడదు.
5. దేవుడు మన ప్రార్థన విన్నపములకు జవాబు ఇవ్వాలి అని చెప్పి ఎవరును బాప్తీస్మము తీసుకొనకూడదు.
6. సరియైన వయసు వచ్చింది అని ఎవరును బాప్తిస్మము తీసుకొనకూడదు.
7. బాప్తిస్మము అనేది ప్రశంసించదగిన చర్య కాబట్టి బాప్తిస్మము తీసుకోవాలి అని అనుకోకూడదు.
8. ఒక సంఘమునకు లేదా బోధకునికి రుణపడి ఉండటం వలన బాప్తిస్మము తీసుకొనకూడదు.
9. సంఘము నుండి ఆర్థిక లేదా వస్తువుల పరముగా సహాయమును ఆశించి ఎవరును బాప్తీసము తీసుకొనకూడదు.
10. ప్రార్థనలో అద్భుతమైన స్వస్థత కలిగింది అని చెప్పి ఏ ఒక్కరూ బాప్తిస్మము తీసుకొనకూడదు.
11. ఒక కలనుకని ఏ ఒక్కరూ బాప్తిస్మము తీసుకొనకూడదు.
12. ఒక వ్యాధి నుండి స్వస్థత కలగాలి అని చెప్పి బాప్తిస్మము తీసుకొనకూడదు.
13. మారుమనస్సు పొందకుండా బాప్తిస్మము తీసుకొనకూడదు.
14. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకుండా బాప్తిస్మము తీసుకొనకూడదు.
15. బాప్తీసమును గూర్చి స్పష్టమైన అర్థము తెలియకుండా ఏ ఒక్కరును బాప్తీస్మమును తీసుకొనకూడదు.
అయితే ఎవరు బాప్తిస్మము తీసుకోవాలి?
మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి (అపోస్తుల కార్యములు 2: 38).
దేవుని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసమును పొందాలి (అపోస్తులు కార్యములు 2: 41.)
ఇదే మనలను దేవునితో నిజముగా కలుపుతుంది. హల్లెలూయ!
- బ్రదర్. జె. ఎఫ్. రోలాండ్స్ గారు
ప్రార్థన అంశం:
యూట్యూబ్ మరియు టీవీ కార్యక్రమాలు చూస్తున్న వ్యక్తులు పరిచర్యను ప్రార్థనతో ఆదుకునే భాగస్వాములుగా లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250