Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.03.2023
Share:

By Village Missionary Movement

Friday, 03-Mar-2023

దిన ధ్యానము(Telugu) 04.03.2023

 

అంశం: ఆపద లైటును వెలిగించాడు

 

"నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము" - యెహేజ్కేలు 3:17

 

రైలు వెళ్లే మార్గంలో ఒక వైపు నుండి మరొకవైపునకు వెళ్లేందుకు లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. ఇక్కడ రైల్వే గేటు కాపలాదారులు ఉన్నారు. ఏదైనా ఆపద వచ్చినట్లయితే పగలు ఎరుపు రంగు జెండాను, రాత్రి సమయంలో ఎరుపు రంగు లైట్ ను చూపించి హెచ్చరిస్తారు. 

 

ఇలా ఒకసారి లెవెల్ క్రాసింగ్ వద్ద ఒక పెద్ద విపత్తు జరిగింది. అనేకమంది మరణించారు. కాబట్టి విచారించడం జరిగింది. కాపలాదారులు పిలవబడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కాపలాదారులు అక్కడ ఉన్నారా? రెడ్ లైట్ వెలిగించారా? అని చాలా ప్రశ్నలు అడిగారు జడ్జి. ఎలాంటి ప్రశ్నలు అడిగినా నేను అక్కడే ఉన్నాను రెడ్ లైట్ ను వెలిగిస్తూనే ఉన్నాను అని అన్నాడు కాపలాదారుడు. చాలా రోజుల తర్వాత విచారణ ముగిసింది. 

 

కొన్ని రోజుల తర్వాత ఆ కాపలాదారుడు తన స్నేహితునితో నువ్వు లైట్ వెలిగించావు కదా అప్పుడు ఆ లైట్ వెలిగిందా అని ఆ జడ్జ్ అడిగితే ఏ సమాధానము చెప్పాలి అని చాలా భయపడ్డాను కానీ ఆయన అలా అడగలేదు అన్నాడు. 

 

కాపలాదారుడు చట్టపకారంగా ఎరుపు లైట్లు వెలిగించాడు కానీ అందుకు అవసరమైన హెచ్చరిక వెలుగు అందులో లేదు. అది కేవలము లైట్ మాత్రమే వెలుగులేని లైట్ కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. 

 

దేశపు కాపలా దారులారా, దేవుని జనులారా, దేవుని సేవకులారా మన జీవితం వెలిగి ప్రకాశించే దీపం వలె ఉన్నదా? లేదా ఆ కాపలాదారుడు లైట్ వలె వెలుతురు లేకుండా ఉన్నదా? మన పరిచర్య అనేది యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి విడిపించి మనలను శుద్ధికరించును అనే సువార్త లేని పరిచర్య వలే ఉన్నదా? ఆ కాపలా దారుడు రెడ్ లైట్ వెలుగు లేకుండానే దానిని వెలిగించినట్లు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కలిగిన పాపక్షమాపణను ప్రకటించని విధముగా సువార్తను ప్రకటించడం దేవుని పరిచర్య అవుతుందా? 

 

ఈరోజు ఆలోచిద్దాం. సరి చేసుకుందాం. దేవుని రాజ్య సేవను నిజాయితీగా చేద్దాం. అత్యుత్తమమైన సేవకుడు అని దేవుడు మనలను పొగుడుతారు. ఎంతటి ఆనందం.

- సహోదరి . ఎస్. బెర్లిన్ సెల్లబాయి గారు

 

ప్రార్థన అంశం:-

వెంటనే ఒక లక్ష సువార్త పత్రికలు ముద్రించవలసిన అవసరం ఉన్నది దాని కొరకు ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort