Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.03.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 05-Mar-2023

దిన ధ్యానము(Telugu) 05.03.2023 (Kids Special)

 

అంశం: సమయాన్ని వృధా చేయవద్దు

 

“ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి” - మత్తయి 25: 13

 

ప్రత్యేకముగా చిన్నపిల్లల కోసం:

 

అది ఒక అందమైన తోట. అక్కడ ఎన్నో చెట్లు పువ్వులతో చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ చెట్లపై గూడు కట్టి నివసిస్తున్న పక్షులను చూస్తే ఇంకా అలా చూస్తూనే ఉండి పోవాలి అనిపిస్తుంది. అందులో ఒక పక్షి నాయకునిగా నియమించబడి మిగతా పక్షులు అన్నింటిని చక్కగా నడిపిస్తూ వచ్చింది. 

 

ఒకరోజు నాయకుడైన ఈ పక్షికి ఒక ఆశ కలిగింది. ఇక్కడ ఉన్న పక్షులు అన్నింటిలో ఏది అప్రమత్తమైన పక్షో కనుక్కోవాలి అని అనుకుంది. ఇందు కొరకు ఒక పోటీని ఏర్పాటు చేసింది. పక్షులన్నీ తమ గూడును అలంకరించాలి అనేదే ఆ పోటీ. ఏ గూడు అందంగా ఉంటుందో అక్కడ ఆ పక్షి నాయకుడు వచ్చి నివాసం ఉంటుంది. అలానే చాలా బహుమతులు కూడా లభిస్తాయి అని చెప్పింది. 

 

దానిని విన్న పక్షులన్నీ కూడా చాలా సంతోషించాయి. నాయకుడు వచ్చి మన గూటిలో నివసిస్తే ఎంత గొప్పతనం పైగా చాలా బహుమతులు కూడా దొరుకుతాయి అని చెప్పి పక్షులన్నీ కూడా గూటిని అలంకరించుకునే వస్తువులను తెచ్చుకొనుటకు ఎగిరి వెళ్లిపోయాయి. కలర్ పేపర్స్, అందమైన పూసలు, ముత్యాలు ఇలా రకరకాల వస్తువులు తీసుకువచ్చి తమ గూడులను అలంకరించాయి. అక్కడ రేమా అనే కాకి ఉంది. అది పక్షులు అన్నింటికంటే ఎక్కువ వస్తువులను సేకరించింది. ఆ వస్తువులు అన్నింటితో అలంకరిస్తే నా గూడు ఎంత బాగుంటుందో అని రేమాకాకి అనుకుంది. కచ్చితంగా నాయకుడు నా గూడులోనే నివాసం ఉంటాడు అని ఆలోచిస్తూ నిద్ర పోయింది. ఉదయాన్నే లేచిన వెంటనే ఇంకా కొంచెం వస్తువులు తీసుకుని వస్తే బాగుంటుంది అని చెప్పి ఎగిరి వెళ్లి వాటిని తీసుకుని గూటికి వచ్చేసరికి సాయంత్రం అయింది. తాను సేకరించిన వస్తువులు అన్నింటిని చూసి చాలా సంతోషించి అయ్యో అలసిపోయాను రేపు ఉదయం అలంకరించ వచ్చులే అనుకోని నిద్రపోయింది. వేకువ జామున రేమా కళ్ళు తెరిచి చూసినప్పుడు అక్కడ పక్షిరాజు ఇంకా మరికొన్ని పక్షులు గూడులు అన్నింటిని చూడడానికి వచ్చాయి. రేమాగుడును అలంకరించకుండా ఉండుటను చూసి వేరే గూడు దగ్గరికి వెళ్లిపోయాయి. రేమా ఏడవడం మొదలు పెట్టింది. ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏమిటి అన్నింటినీ సహకరించి గూడును అలంకరించుకొనకుండా రేపు చూసుకొన వచ్చును అని పనిని నిర్లక్ష్యం చేశాను. సేకరించిన అన్ని వస్తువులు వృధా అయిపోయాయి. నాయకుడు నా గూటిలో నివాసం ఉండకుండా వెళ్ళిపోయాడు అని వాపోయింది రేమా. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి ఇదే విధముగా మనము కూడా మన శరీరమైన ఆలయమును అలంకరించుకొనుటకు ప్రార్థన, బైబిల్ చదవడం అనేవి ప్రాముఖ్యమైనవి. రేపటి దినమును చూసుకొన వచ్చును అని రోజులను గడిపేస్తూ ఉంటే యేసయ్య మన హృదయంలో నివాసము ఉండలేరు. యేసయ్య వచ్చినప్పుడు మనం చేయి విడవబడతాము. కాబట్టి ఈ రోజు నుండి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని యేసయ్య వచ్చి మన హృదయంలో నివాసము ఉండుటకు చోటు ఇద్దాం. ఓకేనా ! 

- కంటత వాక్యం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet