Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.03.2023
Share:

By Village Missionary Movement

Sunday, 05-Mar-2023

దిన ధ్యానము(Telugu) 06.03.2023

 

అంశం: మోకాళ్ళ ప్రార్ధన

 

"యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను" - దానియేలు 6:10

 

ఒక మిషనరీ సంస్థ ఒక నిర్దిష్ట పట్టణానికి సేవ చేయడానికి ఒక మిషనరీని పంపిది. అతను ఉత్సాహంగా వెళ్లి ఆ పట్టణం అంతటినీ చూశాడు. ఒకటి రెండు రోజుల్లో పరిచర్యను మొదలు పెట్టాడు. కొన్ని నెలలు గడిచాయి కానీ ఇతని బోధను ఎవరును వినలేదు. అక్కడ ఉన్న ప్రజలు చాలా గర్వముగా జీవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మానక పరిచర్య చేస్తూ కొంతమందిని కూడా అతను మార్చలేకపోయాడు. కాబట్టి మిక్కిలి బాధతో నా ప్రయత్నం అంతటితో నేను ఏమీ చేయలేకపోయానే అనుకుంటూ ఆ పట్టణం యొక్క ఇంకొక వైపునకు వెళ్లారు. 

 

అక్కడ ఉన్న రోడ్డు పక్కన రాళ్లను పగలగొట్టే ఒక అతనిని చూశాడు అతను పెద్దపెద్ద రాళ్లను సుత్తితో పగలగొడుతూ ఉన్నారు. ఆ సేవకుడు అతని వద్దకు వెళ్లి అయ్యా మీరు ఎలా ఇంత పెద్ద పెద్ద రాళ్లను పగలగొట్టగలుగుతున్నారు అని అడిగాడు. అందుకు అతను అయ్యా కఠినమైన రాళ్లను పగలగొట్టినప్పుడు మోకాళ్లపై నిలబడడం చాలా ప్రాముఖ్యం మోకాళ్ళ పైన నిలబడితేనే ఆ రాళ్ళను పగలగొట్టగలం. మోకాళ్ళ పైన నిలబడినప్పుడు మన శక్తి అధికమవుతుంది. ఎటువంటి కఠినమైన రాళ్లనైనా మనము పగలగొట్టవచ్చు అని అన్నారు. అతని ద్వారా దేవుడు తనతో మాట్లాడుటను ఒక్క క్షణంలోనే అర్థం చేసుకోగలిగాడు ఆ సేవకుడు. సంతోషముగా తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నుండి అనేక సమయాల్లో మోకాళ్లపై నిలబడి విజయాన్ని పొందుకున్నారు. 

 

పరిశుద్ధ గ్రంథములో కూడా మోకాళ్ళ పైన నిలబడి ప్రార్థన చేసి జయాన్ని పొందుకున్న దైవ వ్యక్తిని మనము ఎరిగియున్నాము అతనే దానియేలు .ఈ దానియేలునకు విరోధముగా శాసనముపై సంతకము చేయబడినప్పటికీ దానియేలు యధాప్రకారముగా ముమ్మారు మోకాళ్లని ప్రార్థించారు. దానియేలు యొక్క మోకాళ్ళ ప్రార్థన సింహాల బోనులో నుండి కాపాడింది. అతని యొక్క మోకాళ్ళ ప్రార్థన సింహాలనోళ్లను మూసివేసింది. అవును మోకాలపై నిలబడటమే విజయం యొక్క రహస్యం. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా, పౌలు, ఎస్తేరు వంటి వారు ప్రార్ధించి విజయాన్ని పొందుకున్నారు. మనము కూడా మోకాళ్లపై నిలబడి ప్రార్థించినప్పుడు అధికమైన బలమును పొందుకొనగలము. ఎందుకంటే మన ప్రయత్నంలో విఫలము అవ్వవచ్చును కానీ మోకాళ్ళ ప్రార్ధన ఎన్నడును విఫలము కాదు. అదే విధముగా మన మోకాళ్లు అరిగి నల్లగా మారుతున్న కొద్దీ మన ముఖము ప్రకాశిస్తుంది. మోకాళ్ళ ప్రార్ధన అనేక అడ్డంకులను తొలగించి విజయము పొందుకునేలా చేస్తుంది. హల్లెలూయ! 

- బ్రదర్. టీ. శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

మన మీడియా పరిచర్య ద్వారా అనేక ఆత్మలు దేవుని కొరకు పట్టబడులాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş