Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.03.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 07-Mar-2023

దిన ధ్యానము(Telugu) 07.03.2023

 

అంశం: వ్యర్థమైన భక్తి

 

"పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు" – 1 యోహాను 3:5

 

ఒక భక్తి గల తండ్రి మరణించి చాలా సంవత్సరాలు గడిచాయి. తన కుమారునికి తన తండ్రి గుర్తుకు వస్తే చాలు కన్నీళ్లు వచ్చేస్తాయి. ఎప్పుడు తన తండ్రి కొరకు పొగుడుతూ మాట్లాడుతూ ఉంటాడు. తన తండ్రి ఉపయోగించిన ఒక బైకును గొప్ప ధన నిధి వలె ఇంతవరకు దానిని భద్రంగా ఉంచాడు. తన తండ్రి ఎన్నో కష్టాలను శ్రమలు పడి తనను పెంచిన విధమును కథలుగా చెప్తూ ఉంటాడు. కానీ తను ఏ పని చేయకుండా తండ్రి సంపాదించిన సంపాదనను ఖర్చు చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఇతనిలో చెడు అలవాట్లు ఉన్నాయి. కానీ ఇతని తండ్రిలో ఉన్న ఏ ఒక్క మంచి గుణము కూడా ఇతనిలో లేదు. కష్టాలతో నిండిన తండ్రి జీవితాన్ని భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటున్న ఇతను అంత కష్టపడి ఎందుకు పెంచారో తెలుసుకోలేకపోతున్నాడు. 

 

ప్రభువైన యేసు మన యొక్క పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమయ్యారు అనే విషయాన్ని మరిచిపోయి మనం యేసయ్య పడిన శ్రమలతో కూడిన మరణమును గుర్తు చేసుకుంటూ ఉన్నాము. కన్నీరు కారుస్తూనే వాక్యమును వింటూ ఉన్నాం. లెంట్ దినాలలో యేసయ్య పడిన శ్రమలను కథలుగా మాట్లాడుటలో బాధ కలిగిన ముఖముతో వాటిని వినుటలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాం. ఈ రోజుల్లో సిలువ గుర్తులు మరింత ప్రాముఖ్యం అవుతూ ఉన్నాయి. 

 

లెంటు దినాలు అనుసరిస్తున్న మనము యేసయ్య ఎందుకు శ్రమలను అనుభవించారు, ఎందుకొరకు సిలువ వేయబడ్డారు, ఎందు నిమిత్తము అవమానాలను సహించారు అని వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మానసిక రుగ్మతతో భక్తిని బయలుపరుస్తున్నామా? మనము పాపక్షమాపణ పొందుకొనుటకు పాపము నుండి విడుదల పొందుకొనుటకు యేసు సిలువలో శ్రమలను సహించారు. మనము దేవుని పిల్లల వలే మారి పరిశుద్ధముగా జీవించుటకే ఆయన తన రక్తమును మన కొరకు కార్చారు. యేసుప్రభు యొక్క మంచి లక్షణాలు మనలో కలగాలి అని ఆయన ఘోరమైన శ్రమలను అంగీకరించారు. వీటన్నింటినీ మనం ఆలోచించి నిజమైన మారుమనసు కలిగి ఉన్నతమైన జీవితాన్ని జీవించకపోతే లెంట్ కాలంలో మనము చేసే భక్తి వ్యర్థమైన భక్తే. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:

ఆమెన్ విలేజ్ టీవీలో పనిచేయుటకు సమర్పించుకున్న టెక్నీషియన్స్ మనతో జతపరచబడలాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort meritking meritking giriş