Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.03.2023
Share:

By Village Missionary Movement

Friday, 10-Mar-2023

దిన ధ్యానము(Telugu) 10.03.2023

 

అంశం: వినయం

 

"మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు" - యెషయా 53:2 

 

ఆఫ్రికా దేశానికి చెందిన సామ్యూల్ మోరిస్ అనే సమర్పణ కలిగిన సేవకుడు మనకు తెలిసి ఉండవచ్చు. అతడు అనేక శ్రమల గుండా ప్రయాణించడం వలన గొప్ప వినయమును నేర్చుకున్నాడు. అతను ఇండియానాలో ఉన్న బైబిల్ కాలేజీలో చదువుకొనుటకు వచ్చాడు. ఆ కాలేజీ టీచర్ మీరు ఉండడానికి ఏ గది కావాలి అని అడిగినప్పుడు ఎవరు ఇష్టపడని గది ఏదైనా ఉంటే అదే నాకు ఇవ్వండి అని చెప్పారంట. గతించిన దినాలలో ఈ సంఘటన జ్ఞాపకం చేసుకున్న ఆ కాలేజీ టీచర్ శామ్యూల్ అలా చెప్పినప్పుడు నేను నా కన్నీటిని ఆపుకోలేక నా ముఖమును వేరే వైపునకు తిప్పుకున్నాను. ఎవరు ఇష్టపడని దానిని నేను అంగీకరించగలనా? అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను అని అన్నారు. 

 

ఎవరైనా నన్ను ఇష్టపడని వారిగా ఉన్నట్లయితే నేను వారిని అంగీకరించగలనా? ఈ సమాజంలో నేను బ్రతకగలనా? అనేటటువంటి అనేక ప్రశ్నలు మనలో కలగవచ్చు. ఎవరు ఇష్టపడని చోటు, ఎవరు ఇష్టపడని ఒకదానిని, ఎవరు ఇష్టపడని ఒక వ్యక్తిని మనము సాధారణంగా ఇష్టపడము. కానీ మన పెద్ద సహోదరుడు అయినా యేసుక్రీస్తుకు కూడా ఎవరికి ఇష్టపడని రూపము ఉండేది అని పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది. మనము కూడా క్రీస్తు యేసు యొక్క మనసుతో ఇటువంటి పరిస్థితులను అంగీకరించే విధముగా వినయము గల వారి వలె మారాలి. యేసుక్రీస్తు ఈ విధముగానే జీవించి చూపించారు. 

 

మన నుండి డబ్బు, ధనము, హోదా, ఆస్తి, అంతస్తు, సౌందర్యమును ఈ లోకము ఆశిస్తుంది కానీ మన దేవుడైన యేసు ప్రభువు మన నుండి వినయమును, నిజాయితీని, దయను ఆశిస్తున్నారు. యేసుక్రీస్తు శిలువలో మరణము వరకు తనను తాను తగ్గించుకున్నప్పుడు నేను మీరు ఎంతటి వారము? 

 

గమనిక : ఇతరులు తమ్మును తామే పొగుడుకున్నప్పుడు నేను మాత్రము క్రీస్తు సిలువ నీడలో వినయముతో ఉండి మన యొక్క రక్షణను గుర్తు చేసుకుంటూ అతిశయిస్తూ ఉన్నాను. హల్లెలూయ! 

- శ్రీమతి. బేబీ కామరాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

మనం పంపిస్తున్న ప్రార్థనా విజ్ఞాపన కొరకు బ్రతిమలాడి మాట్లాడి ప్రార్థించే ఎస్తేర్ లు ప్రతి వ్యక్తి యొక్క పని స్థలాల్లో లేచేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet