Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.03.2023
Share:

By Village Missionary Movement

Saturday, 11-Mar-2023

దిన ధ్యానము(Telugu) 11.03.2023

 

అంశం: సులువైన కార్యం

 

"విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము" - 2 దినవృత్తాంతములు 14: 11

 

ఇది పిల్లలకు పరీక్షలకు సిద్ధమవుతున్న మరియు పరీక్షలు రాస్తున్న సమయం. ఈ సంవత్సరం అంతా కరోనా భయము లేకుండా స్కూలుకు వెళ్లి చదువు నేర్చుకుని పరీక్షలు రాయబోతున్నారు. కానీ కొంతమందికి పరీక్షలు ఎలా ఉంటాయో, నేను పాస్ అవుతానా? ఫెయిల్ అవుతానా? నేను ఎక్కువ మార్కులు సంపాదించగలనా? నా ఆరోగ్యం బాగుంటుందా? అని అనేక విషయాలు మనసులో ఉండటం వలన విద్యార్థిని విద్యార్థులు కృంగిపోయి ఉండవచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే కృంగిపోవల్సిన అవసరం లేదు ఎటువంటి స్థితిలో ఉన్నవారికైనా సరే సహాయం చేయాలి అని యెహోవా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. మన అందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది మనము చేయవలసినది అంతా యెహోవా మాకు సహాయం చేయము అని ప్రార్థించి మనకు వీలైనంతవరకు బాగా చదవాలి. 

 

సహాయము చేయడము దేవునికి సులువైన కార్యము అని సహాయము చేయుటకు నీ కన్నా మాకు ఎవరూ లేరు అని రాజైన ఆసా యొక్క జీవితం నుండి మనం చూద్దాం. ఆసా రాజుకు విరోధముగా కూషీయుడైన జెరహు వెయ్యి వేల సైన్యముతో దండెత్తి యుద్ధము చేయుటకు వచ్చాడు. ఆసా యెహోవా వైపు చూస్తూ బలము లేని వారికి సహాయం చేయుటకు నీ కన్నా మాకు ఎవరూ లేరు మాకు సహాయం చేయము అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు బదులుగా 2 లక్షల ఎనభై వేల మంది ఉన్నా ఆసా సైన్యము వేయి వేల మందిని చంపి జెరహు సైన్యమును ఓడించి విజయమును పొందుకొనుటకు దేవుడు దయ చూపారు. 

 

కాబట్టి యవ్వన బాలికలారా మీ ప్రయత్నాలతో పాటు దేవుని సహాయమును కూడా కోరుకొనండి. కొంతమందికి పరీక్షలు అనేది గొల్యాతు వలె కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ పెద్ద గొల్యాతును కూడా చిన్న రాయితో పడగొట్టుటకు దేవుడు దావీదునకు కృపను అనుగ్రహించారు. అటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు మీతో కూడా ఉన్నారు. గొల్యాతు వంటి పరీక్షలకు భయపడవద్దు. మీరు పరీక్షలలో మాత్రమే కాదు జీవితంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీ పోరాటము పరీక్షల వలె మాత్రమే గాక అప్పుల బాధ వలె, వ్యాపారంలో నష్టం వలె కూడా ఉండవచ్చు లేదా మీ పై కోర్టు కేసులు కూడా ఉండవచ్చు. బలవంతులకు మాత్రమే కాదు బలము లేని వారికి కూడా సహాయము చేయడము దేవునికి సులువైన కార్యము. మీ పోరాటముతో పాటు దేవుని కూడా తోడుగా ఉంచుకోనండి. కచ్చితంగా గొప్ప విజయమును సొంతం చేసుకుంటారు. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో ట్యూషన్ సెంటర్ ద్వారా సంధింపబడుతున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు రక్షింపబడేలా ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort