By Village Missionary Movement
Monday, 13-Mar-2023దిన ధ్యానము(Telugu) 13.03.2023
అంశం: భారమైన సిలువ
"నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్త్తి కొని నన్ను వెంబడింపవలెను" - మార్కు 8:34
ఒకరోజు రాత్రి పీటర్ మనసులో భారముతో నిద్రపోయాడు. ఆరోజు రాత్రి ఒక కల వచ్చింది. అందులో తాను ఒక శిలువ ఎత్తుకొని ఏడుస్తూ నడుస్తూ వెళుతూ ఉన్నాడు. దారిలో రెండు పెద్ద పర్వతాల మధ్య వంతెన వలె నిర్మించబడి ఉన్నా ఒక పెద్ద శిలువ మార్గంలో ఒక పర్వతము నుండి ఇంకొక పర్వతమునకు వెళ్లాడు.
నేను ఈ సిలువను మోయలేక పోతున్నాను.నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను? ఈ సిలువ ఎందుకు? అని అనేక ప్రశ్నలతో నడుస్తూ ఉన్న తన చెవులకు ప్రేమతో కూడిన స్వరము ఇలా వినబడింది. పీటర్ ఈ పర్వతంపై అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ గదిలో నీ శిలువను తీసుకుని వెళ్లి పెట్టు అని చెప్పారు. అతను ఆలోచిస్తూ ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు ఆ గదిలో చాలా సిలువలు ఉండటనఉండటను చూశాడు.
అదే స్వరం మరల తనకు వినబడడం మొదలైంది. రెండు పర్వతముల మధ్య ఉన్న సిలువ వంతెనపై నీ సిలువను నేను మోసాను దానిని సులభముగా దాటగలిగావు కదా ఇప్పుడు ఈ గదిలో ఉన్న సిలువలలో నీ సిలువను పోల్చి చూడు ఏది గొప్పది అని వినబడింది. అతను చూసినప్పుడు సిలువలు అన్నింటికంటే తన సిలువ మిక్కిలి ప్రత్యేకంగా ఉండుటను చూసి సిగ్గుతో తలదించుకున్నాడు అప్పుడే అది ఏసయ్య స్వరము అని గ్రహించగలిగాడు
మనము కూడా ప్రతిరోజు జీవితంలో శోధనలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనకు మాత్రమే ఇంత పెద్ద భారము అని బాధపడి దేవునిపై ఉన్న విశ్వాసమును కోల్పోతూ ఉంటాము. ఆయన ఇప్పటికే సిలువలో మన అందరి భారములను భరించారు. తండ్రి యొద్దకు ప్రవేశించుటకు మార్గమును సిద్ధం చేశారు. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము.
పీటర్ వలే ఉండక భారమైన సిలువ అని అనుకోకుండా నా సిలువ భారమును నా యేసు మోసి నాకు విడుదల కలిగించారు అనే విశ్వాసముతో మన కొరకు నియమించిన విశ్వాస పరుగులో ఓపికగా పరిగెత్తుటకు దేవుడు కృప అనుగ్రహించును గాక! ఆమెన్.
- శ్రీమతి.జయంతి భాగ్య నాదన్ గారు
ప్రార్థన అంశం:
ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, మరియు చత్తీస్గడ్ రాష్ట్రాల్లో గల సేవా స్థలాల్లో జరిగే సేవలను దేవుడు ఆశీర్వదించు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250