Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.03.2023
Share:

By Village Missionary Movement

Monday, 27-Mar-2023

దిన ధ్యానము(Telugu) 27.03.2023

 

అంశం: క్రీస్తు హస్తం

 

"నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు" - యోహాను 15:4

 

ఒక పేద పిల్లవాడు ఒక దుకాణం ముందు నిలబడి లోనకు వెళ్లే వారిని బయటకు వచ్చి వారిని చూస్తూ ఉన్నాడు. తనని గమనించిన ఆ దుకాణదారుడు కనికరించి నీకేం కావాలి అని ఆ పిల్లవాడిని అడిగాడు. కానీ ఆ బాబు ఏమి మాట్లాడలేదు. వెంటనే ఆ దుకాణదారుడు లోనికి వెళ్లి ఒక చాక్లెట్ డబ్బాను తీసుకుని వచ్చి నీకు కావలసిన చాక్లెట్లు తీసుకో అని అన్నారు. 

 

కానీ ఆ బాబు ఆ దుకాణదారుడుని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దుకాణదారుడు ఎందుకు అలా చూస్తూ ఉండిపోయావు నీకు చాక్లెట్లు వద్ద అని అడిగాడు. అందుకు ఆ బాబు నా చేయి చాలా చిన్నది నేను తీసుకుంటే చాక్లెట్లు కొద్దిగా మాత్రమే వస్తాయి కానీ మీ చేయి పెద్దది మీరే తీసి ఇస్తే ఎక్కువ చాక్లెట్లు వస్తాయి అందుకే మీరే తీసి ఇవ్వండి అని అన్నాడంట. 

 

అవును ప్రియమైన వారలారా! మనము మన సొంత ప్రయాసముతో సంపాదించే విజయము కంటే దేవుని హస్తాల పైన అనుకుని ఆయన యొద్ద నుండి పొందుకొనిన విజయం చాలా అధికముగా ఉంటుంది. మన యొక్క ప్రతి చర్యలలో క్రీస్తుని ముందు ఉంచి నడుచుకున్నట్లయితే విజయం మనకే. 

 

పరిశుద్ధ గ్రంథములో గిద్యోను అనే వ్యక్తిని మనము చూసినట్లయితే విశ్వాస వీరుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఇతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయం చేశాడు. ఇతను మిద్యానీయులకు వ్యతిరేకముగా ఉండి యెహోవా మాటకు లోబడి 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. చేతిలో కత్తి లేకుండా బూరలను, వట్టికుండలను, దివిటీలను మాత్రమే తీసుకొని 300 మందితో వెళ్లి విశ్వాసముతో విజయమును సాధించాడు. అవును 1కోరింది 1:28లో బలవంతులను సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని చూస్తున్నాం. ఈరోజు మనము కూడా మనలను దేవుని చేతులకు సమర్పించుకొని ఆయన పైన ఆనుకొని ఆయనకు లోబడి జీవించినట్లయితే దేవుడు మనలను తన చిత్త ప్రకారము హెచ్చిస్తారు. దేవుడు ఎవరిని త్రోసి వేసేవారు కాదు. మనమందరము ఆయన రక్తములో కడగబడి ఉన్నాం. ఆయన పిల్లలమైన మనము ఆయన బలమైన చేతుల కింద లోబడి విజయం పొందుకుందా. ఆమెన్! 

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఫిలిప్ గాస్పల్ టీం మినిస్ట్రీ ద్వారా నూతనముగా సందింపబడుతున్న గ్రామాలలో దేవుడు ఉజ్జీవమును కలుగజేయులాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet