Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.03.2021
Share:

By Village Missionary Movement

Thursday, 04-Mar-2021

దిన ధ్యానము(Telugu) 04.03.2021

వాక్యనిర్మాణ జ్ఞానం.

"...నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను” - అపొ. కార్యములు 26:3

దేవుని సంఘం కొన్ని శతాబ్దాలుగా చీకటి కాలములో నడుస్తూ వచ్చింది. సత్బోధలను తిరస్కరిస్తూ మనుష్యులను, దూతలను దేవాలయములో ఆరాధించేవారు.  క్రీ.శ 15 వ శతాబ్దంలో రెండవ పౌలు అని పిలవబడుతున్న మార్టిన్ లూథర్ ద్వారా గొప్ప సంస్కరణ ఏర్పడింది. ఆయన బైబిల్ బోధించే ఆరాధనకు విరుద్ధంగా బోధించే తప్పిదములను దైర్యంగా ఎత్తి చూపించారు. విట్టన్ బర్గ్ దేవాలయములో 95 బైబిల్ నియమాలను రాసి దేవాలయము తలుపునకు అంటించారు. 

దీని వలన ఆ దినములో ఉండిన మత పరమైన నాయకులు అనేకమైన హత్యా ప్రయత్నములు మార్టిన్ లూథర్ పై చేయించారు. రోమా నగరంలో కార్డినెల్ గెసెట్ అనే వ్యక్తి ముందు న్యాయము కొరకు నిలబడ్డారు. మరియు విటన్ బర్గ్ అనే నగరంలో విచారణ అనే పేరు క్రింద జరిగిన సమస్త బెదిరింపులకు భయపడకుండా ఉన్నారు మార్టిన్. తాను న్యాయము విచారించినప్పుడు సమస్త స్థలములలో వాక్య నిర్మాణ  జ్ఞానముగా మాట్లాడి సత్యాన్ని ప్రసంగిచారు.

ఈ దినపు లేఖన భాగంలో కూడా అపోస్తులుడైన పౌలు ఫేస్తు, ఫెలిక్స్ అగ్రిప్ప రాజు ముందు న్యాయపీఠము ఎదుట నిలబడి యుండుట చూస్తున్నాం. ఆదినాల్లో ఉండిన పరిసయ్యులు, సద్దుకయ్యుల నాయకుల ద్వారా పౌలుకు అనేక విధములైన హత్యా ప్రయత్నములు, బెదిరింపులు వచ్చిన దానిని బైబిల్లో చూస్తున్నాం. ఎలాగైనా కొందరిని రక్షించుటకు అందరికి చెందిన వాడిగా మారెను అని అంటున్నారు పౌలు. తాను న్యాయము విచారించబడిన స్థలములలో నిలబడినప్పుడు తాను జ్ఞానముగా మాట్లాడారు. అదే సమయంలో ఆయా స్థలములలో ఉన్న అందరూ రక్షించబడేటట్లు సువార్తను కూడా ప్రకటించారు.  

క్రీస్తునందు ప్రియమైన వారలారా! ఈ సంతతి వారికి విరివిగా సువార్తను ప్రకటించుటకు అనేక కష్టమైన కార్యములను ఎదుర్కొంటున్నాం. ఈ మధ్యలో కూడా మార్టిన్ లూథర్, పౌలు వంటి అనేకమైన సాక్షులు మనలను ఉత్సాహ పరచుటకు మనముందు ఉన్నారు. కాబట్టి పరుచర్యలో నిరుత్సాహ పడిపోకుండా మనము దేవుని యొద్ద కృపను, జ్ఞానమును అడిగి పొందుకుందాం. మన పరిచర్యలో ఎదుర్కొనే సవాళ్ళను ఎదుర్కొని సువార్తను, సత్యాన్ని ప్రకటించుటకు దేవుడు మనకు కృపను దయచేయును గాక!
-    బ్రదర్. పి.జాకబ్ శంకర్

ప్రార్థన అంశం:-
రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజీలో విద్యార్థులకు నేర్పిస్తున్న సేవకులను దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet cratosroyalbet