Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.03.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 29-Mar-2023

దిన ధ్యానము(Telugu) 29.03.2023

 

అంశం: బానిస జీవితమా

 

"మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము" - రోమీయులకు 6: 17-18

 

నా చిన్న వయసులో చదివిన కథ ఇప్పుడు గుర్తుకు వస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు తనతో యుద్ధము చేసి ఓడిపోయిన రాజును, తన సైన్యమును, తమకున్న ఆస్తులను, ఆవులను, గొర్రెలను మరియు విలువైన వస్తువులను రాజు యొక్క కిరీటం, ఉంగరం అతని యొక్క కత్తి మరియు అతని యొక్క జనులందరిని తనకు బానిసలుగా చేసుకుంటాడు. ఒక దేశమునకు బానిసలుగా తీసుకుని వెళ్ళబడితే లేదా అమ్మబడితే అందులో నుండి బయటికి రావడం అంత సులభము కాదు. మరణము వరకు కూడా బానిసలుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు కానీ బానిసగా అమ్మబడి దేవుని చేత హెచ్చింపబడిన ఒక వ్యక్తిని గూర్చి మనము తెలుసుకుందాం. 

 

పరిశుద్ధ గ్రంథములో బానిసగా అమ్మబడి దేవుని చేత ఉన్నత స్థితికి వెళ్లిన వ్యక్తి అంటేనే మనకు యోసేపు గుర్తుకు వస్తాడు. యోసేపు బానిస వలె పుట్టలేదు కాని బానిసగా అమ్మబడ్డాడు. చేయని తప్పుకు శిక్షను అనుభవించిన ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడై ఉండుటకు కారణం యెహోవా యోసేపునకు తోడై ఉండటం. దీనిని వేరే విధముగా చెప్పాలి అంటే యోసేపు యెహోవాకు దగ్గరగా ఉండి జీవించాడు అని చెప్పగలం. ఈరోజు మనకు దేవునికి మధ్య ఉన్న బంధం ఏమిటి? యోసేపు వర్ధిల్లుచు ఉన్నాడు అని అతను యజమానుడు తెలుసుకొనగలిగాడు. యవ్వన కాలంలో యవ్వనేచ్చలు నుండి పారిపోయిన యోసేపు యొక్క పరిశుద్ధత మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఈనాడు మనము పరిశుద్ధులముగా జీవించుటకు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం. తనతో పాటు చరసాలలో ఉన్న పానదాయకుడు మరియు భక్షకారుడు చింతాక్రాంతులుగా ఉండుట చూసిన యోసేపు వారిని ప్రేమగా విచారించాడు. ఇదే విధముగా మనకు సమీపంలో ఉన్నవారు చింతాక్రాంతులై ఉండుట చూస్తే మనము వారిని ప్రేమగా విచారించి సహాయం చేస్తున్నామా? నాకే చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఎవరిని పట్టించుకోలేను అనే మనసుతో జీవిస్తున్నామా అని ఆలోచిద్దాం. కలలకు అర్థం చెప్పడం అతని యొక్క చాతుర్యం, భావములు చెప్పుట దేవుని జ్ఞానం కదా అని చెప్పి దేవుని హెచ్చించే విధానము ఒక దేశపు రాజునే ఆశ్చర్యపరిచింది. యోసేపుకు ఉంగరం మరియు సన్నపు నార బట్టలు, బంగారు గొలుసు వేసి తన యొక్క రెండవ రధము మీద అతనిని ఎక్కించి ఐగుప్తు దేశమంతటి మీద అతని అధికారిగా నియమించెను. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన స్నేహితులారా! ఏదో ఒక విషయంలో బానిసై అంగలారుస్తూ ఉన్నారా? యోసేపుతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నారు. బానిసత్వమును ఆయన ఆశ్చర్యముగా మార్చగలరు. విశ్వసిద్దాం మరియు మనలను మనము సమర్పించుకుందాం. దేవుడు మనలను కూడా హెచ్చిస్తారు. హల్లెలూయ! 

- సిస్టర్. ఎ. బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం: 

నూతనంగా ప్రారంభించిన సేవా స్థలాలలో ఐదు ద్విచక్ర వాహనములు అవసరమై ఉన్నాయి వాటి కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet