Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.04.2023
Share:

By Village Missionary Movement

Saturday, 01-Apr-2023

దిన ధ్యానము(Telugu) 01.04.2023

 

అంశం: మనము గ్రహింపు కలిగిన వారమా? 

 

"యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను" - లూకా 23:34

 

యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడుటకు కారణం ఎవరు లేక ఏమిటి అని ఆలోచిస్తే యెషయా గ్రంథము 53:5 లో సమాధానమును చూడవచ్చ. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

కాబట్టి మీరు, నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరము ఆయన సిలువ వేయబడుటకు కారకులమే. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడబడినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని వీరి కొరకు బ్రతిమలాడి మాట్లాడుతున్నారు. 

 

ఆ కాలంలో యూదులు ముఖ్యముగా పరిసయ్యులు, సద్దుకయ్యలు అందరూ కలిసి పన్నాగం పన్నీ యేసుక్రీస్తు ప్రభువునకు శిలువ వేశారు.ఇస్కరియోతు యుదా డబ్బులు తీసుకుని ఫిలాతుకు అప్పగించే వరకు కారణం వీరే అని మనకు తెలుసు. దేవుని వెతికి దైవ వాక్యమును పరిశోధించే ఈ పరిసయ్యులు, సద్దుకయ్యలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క విషయములో తాము చేసినది 100 కి 100% సరైనదే అనుకున్నారు. అందువలననే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వీరి కొరకు తండ్రికి ప్రార్థించారు. 

 

మన ప్రభువు సిలువలో పలికిన మాటలు మనకు తెలియజేసే అర్థం ఏమనగా మనము మన దృష్టిలో 100కి 100% సరైనదే అనుకున్న కొన్ని విషయాలు దేవుని దృష్టిలో 100 కి 100% తప్పు అయి కూడా ఉండవచ్చు. ఇటువంటి తప్పులన్నింటినీ మన దేవుడు తన దయతో క్షమిస్తున్నారు. అయితే మనము ఏ విషయంలో కూడా గ్రహింపు లేకుండా తెలుసుకోకుండా ఉంటున్నామా అని మనలను మనమే పరీక్షించి చూసుకోవాలి. మీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము అని కీర్తనకారుడు 139:24 లో ప్రార్థించిన విధముగా మనము కూడా ప్రార్థించాలి. దీనిని తెలుసుకొన దగిన గ్రహింపగలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథము నుండి ఇతరుల ద్వారా మన యొక్క లోటులను తెలుసుకొని సరి చేసుకొనుటకు ప్రయాస పడదాం. హల్లెలూయ! 

- బ్రదర్. జె. సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఈనెల అంతా జరిగే పరిచర్యలో దేవుని హస్తం తోడుండి నడిపించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet