Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.04.2023
Share:

By Village Missionary Movement

Monday, 03-Apr-2023

దిన ధ్యానము(Telugu) 03.04.2023

 

అంశం: పరదైసు

 

"అందుకాయన వానితోనేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను" - లూకా 23:43

 

యేసు క్రీస్తు ప్రభువు సిలువలో పలికిన రెండవ మాట. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయనతోపాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలతో ఒక దొంగ వైపు ఉండి మాట్లాడారు. సిలువలో ఘోరమైన శ్రమతో వేదన పడుతున్నప్పుడు తనను శ్రమ పెట్టే వారిని తండ్రి వీరిని క్షమింపుము అని పలికిన సద్గుణమును ఆ దొంగ గమనించాడు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ, క్షమాపణ, కరుణ అన్నింటిని చూసిన ఆ దొంగ అప్పటికప్పుడే మారుమనస్సు పొందాడు. ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని తన విన్నపమును యేసుప్రభువుతొ చెప్పాడు. 

 

ఆ సమయంలో యేసుప్రభు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని పలికారు. చెడు జీవితాన్ని విడిచి మారుమనస్సు పొందిన ఏ పాపికైనా పాపక్షమాపణ, నిత్యజీవము కలవు అని మనకు వాగ్దానము చేసియున్నది. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను అని దేవుడు చెబుతున్నారు. మారుమనస్సు పొంది యేసుని యొద్దకు వచ్చిన ఆ మనిషికి దేవుడు ఇచ్చిన మొదటి ఆశీర్వాదము రక్షణ ఆనందమే. 

 

డి.యల్ మూడీ అనే సుమార్తికుడు పాపక్షమాపణ పరలోకమును గూర్చి ప్రసంగిస్తూ ఉన్నారు. కూటమి చివరిలో ఒక గోరమైన చెడు మనసు గలవాడు తన చెడుతనం తన వలన కలిగిన పాపపు క్రియల వలన తన ఇల్లంతా నిండి ఉన్న దానిని మూడీకి చూపించారు. వీటన్నింటిని మీ యేసయ్య క్షమిస్తారా? ఆయన నన్ను అంగీకరిస్తారా? అని బాధతో నిండిన స్వరముతో అడిగాడు. అందుకు మూడీ గారు చాలా నెమ్మదిగా శాంతి కలిగిన స్వరముతో ఖచ్చితముగా యేసు నిన్ను క్షమిస్తారు తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటారు అని అన్నారు. వెంటనే ఆ మనుష్యుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాడు. పరలోకపు సంతోషాన్ని అనుభవించాడు. మనము కూడా మన యొక్క పాత పాపపు జీవితాన్ని విడిచి యేసయ్య చెంతకు తిరిగి వచ్చినప్పుడు నిత్య జీవమైన పరలోకం మనకు కలదు అని మన ప్రేమ గల ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. మనము దానిని సొంతము చేసుకుందుము గాక. ఆమెన్! 

- బ్రదర్. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఆకలి గొనిన వారికి ఆహారం అందించే పరిచర్యలో ఈరోజు సంధింపబడుతున్న ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet