Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.04.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 11-Apr-2023

దిన ధ్యానము(Telugu) 11.04.2023

 

అంశం: సిలువ చెoత

 

"మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను" - యెషయా 53:5

 

క్రైస్తవ కుటుంబంలో పుట్టి కుటుంబ ప్రార్థన, సంఘ ఆరాధన, సండే స్కూల్ ఇలా సాంప్రదాయ పద్ధతిలో పెరిగాను. చెప్పే వాక్యములను అందరికంటే ముందు చదవడంలో నాకు చాలా గర్వముగలిగేది. ఒకసారి సెలవుల్లో నేను మా మామగారి ఊరికి వెళ్ళినప్పుడు ఒక కన్వెన్షన్ కూటములో పాట పాడే అవకాశం వచ్చింది. అందరికంటే నేను సరిగా మంచిగా ఉన్నాను అందుకే నాకు అవకాశం వచ్చింది అని నా మనసు రెక్కలు చాచి ఎగురుతూ ఉంది. ఆరోజు దైవజనుడు చెప్పే వాక్యాన్ని విని అనేకులు తమ యొక్క పాపపు అలవాట్లను ఒప్పుకొని విడిచిపెట్టి సిగరెట్డీ, బిడి వంటి వాటి నుండి విడుదల పొంది దేవుని కొరకు తమ్మును తము సమర్పించుకున్నారు. నేను మాత్రం పెద్ద భక్తిపరురాలు వలె వారి వైపు చూస్తూ గమనిస్తూ ఉన్నాను. రెండవ రోజు కూటమిలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను ఆయన భరించిన సిలువ శ్రమలను గూర్చి వివరించి చెప్పినప్పుడు నా హృదయము పగిలిపోయింది. నేను పాపిని అని ఒప్పుకున్నాను. నాలో ఉన్న పాపములు, గర్వము, అబద్ధాలు అన్నింటినీ ఒప్పుకొని మరలా జన్మించిన అనుభవాన్ని పొందుకున్నాను. 

 

యేసుని శిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కూడా ఇద్దరు దొంగలను సిలువ వేశారు. అందులో ఒకడు గర్వముగా మాటలాడి యేసయ్యను పరిహాసం చేశాడు. ఇంకొక దొంగ మాత్రం యేసు సిలువలో పలికిన మాటల విని తాను చేసిన పాపములను గ్రహించి మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని తనకు తాను నిదానించి గ్రహించి పాపములను ఒప్పుకొని చివరిగా రక్షణ ఆనందమును పొందుకొని పరలోక వాసిగా మారిపోయాడు. 

 

నాకు ప్రియమైన వారలారా! సిలువ వేయడానికి ముందు తాను చేసిన పాపములను గ్రహించిన దొంగ వలె ఆ సిలువ దృశ్యము నన్ను కూడా మార్చేసింది. అవును సిలువ ముందు మన గర్వమును వదిలివేయాలి. ఆయన త్యాగముతో మన త్యాగమును, ఆయన శ్రమలతో మన శ్రమలను సరిపోల్చగలమా? ఆయన యొక్క క్రియల ముందు మన క్రియలు నిలవగలవా? సిలువ చెంతకు వచ్చిన మన జీవితంలో వెనదిరిగి చూద్దాం మనలో ఉన్న స్వార్థము తొలగిపోతుంది. ఆమెన్! 

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు 

 

ప్రార్థన అంశం:

యవ్వనస్తుల ఉజ్జీవపు కూటమునకు గల ఆర్థిక అవసరతలు సంధింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino perabet perabet giriş perabet perabet giriş perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş Online casino nz Best payout online casino nz matbet jojobet jojobet giriş jojobet güncel giriş bahsegel bahsegel bahsegel matbet romabet lunabet