Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.04.2023
Share:

By Village Missionary Movement

Saturday, 15-Apr-2023

దిన ధ్యానము(Telugu) 15.04.2023

 

అంశం: వెలకట్టలేని ముత్యం

 

“నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను” - హోషేయా 8:12 

 

రొమేనియాలో కమ్యూనిస్టులు మరియు నాస్తికుల హింసల మధ్యలో మిక్కిలి ధైర్యముగా దేవుని సేవ చేశారు రీఛార్జ్ ఓబ్రాంట్ అనే దైవజనుడు. రష్యా సరిహద్దులలో అతను సేవ చేసినప్పుడు జరిగిన ఒక సంఘటన నేను మీకు చెబుతాను. అది ఒక శీతాకాలము మంచు వర్షపు చినుకులతో నిండి ఉంది. రష్యా నుండి ఇద్దరు అతనిని చూడడానికి వచ్చారు. తనను చూడడానికి వచ్చిన వారిని ఆహ్వానించిన రీఛార్జ్ ఓబ్రాంట్ వారు తనని చూడడానికి రావడానికి గల కారణము బట్టి సంతోషించారు. కారణం ఏమిటంటే వారు పరిశుద్ధ గ్రంథము కావాలి అని అడగడానికి వచ్చారు. రోమేనియా వలె రష్యాలో కూడా క్రైస్తవులు హింసింపబడుతూ ఉండేవారు. రెండు వారముల తర్వాత ధన్యవాదములు తెలుపుతూ ఒక లేఖ వచ్చింది. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. అది మాత్రమే కాదు మా దగ్గర సొంతముగా బైబిల్ ఉంది అని తెలిసి పక్క గ్రామాల నుండి క్రైస్తవులు వచ్చి తీసుకుని చదువుతూ ఉన్నారు. ఇలా చాలామంది వచ్చి అడగడం వలన మేము ఒక నిర్ణయానికి వచ్చాము. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమును 32 భాగాలుగా విడదీశాం. 32 గ్రామాలలో కూడా రష్యా ప్రజలు దానిని చదివి ప్రయోజనమును పొందుతున్నారు అని ఆ లేఖలో రాసి ఉంది. దీనిని చదివిన రీఛార్జ్ ఓబ్రాంట్ రొమేనియాలో మాత్రమే కాదు రష్యాలో కూడా దేవుని పనిని ధైర్యంగా చేశారు. 

 

ప్రియమైన వారలారా! బైబిలు దొరకగా ఇబ్బంది పడిన రొమేనియా ప్రజలు రష్యా ప్రజలు మరియు అరబ్ దేశ క్రైస్తవులు అనేకులు కలరు. కానీ బైబిల్ ను చేతిలో పట్టుకొని దానిని చదవని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. మరి మనము దేవుని న్యాయ తీర్పులో ఎలా తప్పించుకుంటాం. వేదాంత వేత్తలు అనే పిలవబడుతున్న మనము ఎన్ని రోజులు దానిని చదువుతున్నాం. మనలో అనేకులు బైబిల్ ను చదవకుండానే వేదాంత వేత్తలుగా తిరుగుతున్నాం. ఆనాడు రష్యా ప్రజలు తమ చేతుల్లో బైబిల్ దొరికిన ఆ అరగంట సమయం లేదా అంతకంటే తక్కువ సమయంలో ఎంతో జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా చదివి ఉంటారో కొంచెం ఆలోచించి చూద్దాం. సమయాన్ని వెచ్చించి బైబిల్ ను చదవండి మీ జీవితం ముత్యం వలే మారుతుంది. దేవుడు తన మాటలు ద్వారా మిమ్మును ఆశ్చర్యకరముగా నడిపించుట మీరు చూస్తారు. హల్లెలూయ! 

- శ్రీమతి. జ్ఞాన సెల్వం సెల్వరాజ్ గారు 

 

ప్రార్ధన అంశం: 

పాఠశాల మరియు కళాశాలలో గల విద్యార్థుల మధ్య జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort