Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.04.2023
Share:

By Village Missionary Movement

Monday, 24-Apr-2023

దిన ధ్యానము(Telugu) 24.04.2023

 

అంశం: వేచి ఉన్న దేవుడు

 

"ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు" - యోబు 34:21

 

నేను బాల్యమును దాటి యవ్వనంలోనికి అడుగుపెట్టాను. ఆ రోజులలో సువార్త సభలు ఎక్కువగా జరుగుటకు అవకాశం లేని ఊరిలో జీవిస్తూ వచ్చాను. ఆదివారపు ఆరాధనకు మాత్రం వెళ్తాను. యవనస్తుల కూడికకు ఇంట్లో వారు పంపించేవారు కాదు. ఇంట్లోనే బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటాను. సినిమాలు చూడడం తప్పు అని నాకు ఎవ్వరూ చెప్పలేదు. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు సినిమాలకు వెళ్లే దానిని. లెంటు దినాలలో పువ్వులు పెట్టుకోకూడదు సినిమాలకు వెళ్లకూడదు అని అత్యుత్సాహంగా ఉంటాను. ఒకసారి నా కుటుంబ స్నేహితుల యొక్క కుమార్తెతో కలిసి ఒక గొప్ప దర్శకుడు యొక్క సినిమాకు వెళ్ళాము. కానీ మేము అ సినిమా చూడలేకపోయాము. ఈ సినిమా కోసం వచ్చామా అని అడుగుతూ తలదించుకొని చూసి చూడనట్లు సమయాన్ని గడిపేసాం. నేను పెద్ద పాపము చేసినట్లు గ్రహించాను. మా తల్లిదండ్రుల యొక్క ముఖమును కూడా చూడలేకపోయాను. ఇకపై నేను సినిమాలకు వెళ్ళను అని నిర్ణయించుకున్నాను. 

 

కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు శోధన వచ్చింది. నేను ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలు చూడవలసిన సినిమా అని చెప్పి అందరిని పిలవవలసిన పరిస్థితి వచ్చింది. నాతో పాటు ఉద్యోగం చేస్తున్న ఒక సహోదరి ఇది ఒక సక్సెస్ సినిమా. చాలా దేశాలను దీనిలో చూపిస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళగలమా మామూలుగా రమ్మని చెప్పింది. నాలో ఒక ఆశ కాబట్టి వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ రాత్రి ఒక కల వచ్చింది. ఒక పొడవైన రహదారి తెల్లటి దుస్తులు ధరించిన ఒక ఆయనతో నేను నడుస్తూ ఉన్నాను. దారిలో ఒక థియేటర్ ఉంది. నేను ఆయనతో రండి థియేటర్ లోనికి వెళ్దాం అని అన్నాను. ఆయన నేను రాను అని అన్నారు. నీకు వెళ్లాలి అని ఉంటే వెళ్ళు నువ్వు వచ్చేవరకు నీ కొరకు వేచి ఉంటాను అని అన్నారు. నేను ఆయనను చూశాను మీరు రాని స్థలానికి నేను కూడా వెళ్ళను రండి ముందుకు సాగుదాం అని చెప్పి ఆయనతో కలిసి నడవడం ప్రారంభించాను. పాఠశాలకు వెళ్లి నేను సినిమాకు రాను అని చెప్పేసాను. 

 

ప్రియమైన వారలారా! మన ప్రభువు యొక్క ప్రేమను చూడండి దారి తప్పిపోయిన సరే ఆయన మన కొరకు వేచి ఉంటున్నారు. చిన్న కుమారుని కొరకు వేచి ఉన్న తండ్రి వలె ఈనాడు మన కొరకు మన ప్రభువు వేచి ఉన్నారు. ఆయన ప్రేమ వైపునకు తిరుగుదాం. హల్లెలూయ! 

- శ్రీమతి. వనజా బాలరాజ్ గారు 

 

ప్రార్థన అంశం: 

యవ్వనస్తుల కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవుని చేతిలో ఖడ్గం వలే వాడబడు లాగున ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet